`ప్రాజెక్ట్ కే` అనేది ఏంటనేది చాలా కాలంగా వెంటాడుతున్న ప్రశ్న. `కే` మినింగ్ ఏంటని అందరిని తొలుస్తున్న ప్రశ్న. తాజాగా అసలు పేరుని ప్రకటించింది యూనిట్. అమెరికాలోని కామిక్ కాన్ శాన్ డియాగో ఈవెంట్‌లో `ప్రాజెక్ట్ కే` అసలు పేరుని వెల్లడించారు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `ప్రాజెక్ట్ కే`. `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కమల్‌హాసన్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయనది నెగటివ్ రోల్ అని టాక్. అయితే `ప్రాజెక్ట్ కే` అనేది ఏంటనేది చాలా కాలంగా వెంటాడుతున్న ప్రశ్న. `కే` మినింగ్ ఏంటని అందరిని తొలుస్తున్న ప్రశ్న. దానికి `కృష్ణుడు` అని, `కల్కి` అనే ఊహాగానాలు వినిపించాయి.
తాజాగా అసలు పేరుని ప్రకటించింది యూనిట్. అమెరికాలోని కామిక్ కాన్ శాన్ డియాగో ఈవెంట్‌లో `ప్రాజెక్ట్ కే` అసలు పేరుని వెల్లడించారు. ఈ మేరకు టైటిల్ గ్లింమ్స్ ని విడుదల చేశారు. తాజాగా `ప్రాజెక్ట్ కే` మీనింగ్ తెలిపారు. `కల్కి` అనే పేరుని ఖరారు చేశారు. `కల్కి 2898ఏడీ`గా నిర్ణయించారు. ఈ సందర్బంగా విడుదల చేసిన గ్లింమ్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. భవిష్యత్‌లో జరగబోయేది ఇందులో చూపించారు. అంటే 825 ఏళ్ల తర్వాత జరిగే కథగా ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది.
ఇందులో ఓ సూపర్ పవర్ కలిగిన ప్రత్యర్థుల చేతిలో మనుషులు బంధించబడతారు. అనేక ఆగడాలకు గురవుతుంటారు. వారిని కాపాడేందుకు మన సూపర్ హీరో( ప్రభాస్) వస్తారు. సూపర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రత్యర్థులను అంతం చేసి తమ వారిని రక్షించేందుకు పోరాడతాడు. ఈ క్రమంలో `వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే` అని ప్రత్యర్థి ప్రశ్నించగా `కల్కి 2989 ఏడీ` అని రావడం విశేషం. చివరగా 2898 నుంచి 2024 వరకు చూపించారు. అప్పటి కాలానీకి, ప్రస్తుతానికి ముడిపెట్టేలా కథ ఉండబోతుందని తెలుస్తుంది.

ఇందులో ప్రపంచాన్ని చీకటి అధీనంలోకి తీసుకున్నప్పుడు ఒక శక్తి ఎదుగుతుంది. అప్పుడు అంతం ప్రారంభమవుతుంది` అనే క్యాప్షన్ అదిరిపోయేలా ఉంది. ఇదంతా వేరే గ్రహంపై జరుగుతున్నట్టుగా ఉంటుంది. సైన్స్ ఫిక్షన్‌గా ఈ గ్లింప్స్ సాగింది. `ప్రాజెక్ట్ కే` అంటే ఏంటనేది ఇందులో కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది. అదొక మిషన్‌గా తెలుస్తుంది. దాన్ని ప్రత్యర్థులు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతుంది. మొత్తానికి గ్లింప్స్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్‌తో విమర్శలు ఎదుర్కొన్న వారికి గ్లింప్స్ సమాధానం చెప్పేలా ఉందని చెప్పొచ్చు. ఇందులో ప్రభాస్‌ని, దీపికా పదుకొనె, అమితాబ్ లను చూపించారు. కథగా చూస్తే ఇదొక కొత్త రకమైన స్టోరీగా అనిపిస్తుంది. ఊహించని విధంగా ఉండబోతుందనే ఫీలింగ్ కలుగుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకునేలా ఉందని చెప్పొచ్చు.
