ప్రభాస్ నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌కి సంబంధించిన రూమర్స్ బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఓటీటీ సంస్థలు పెద్ద షాక్ ఇచ్చాయి.
ప్రభాస్ హీరోగా నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా గత నెలలో విడుదలై బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే వెయ్యి కోట్లు దాటింది. మరిన్ని కలెక్షన్ల దిశగా వెళ్తుంది. పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఇంకా థియేటర్లలో రన్ అవుతుంది. చాలా చోట్ల మంచి ఆదరణ దక్కుతుంది. హౌజ్‌ఫుల్ అవుతున్న షోస్ కూడా ఉండటం విశేషం. మరో నెల రోజులపాటు `కల్కి`కి తిరుగులేదని చెప్పొచ్చు.
ఈ సినిమా ఇప్పటికే కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ప్రభాస్ నుంచి రెండో హైయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. వెయ్యి కోట్లు దాటిన ఆరో సినిమాగా నిలిచింది. `బాహుబలి2`, `దంగల్`, `ఆర్‌ఆర్‌ఆర్`, `కేజీఎఫ్ 2`, `జవాన్`, `పఠాన్` చిత్రాలు వెయ్యి కోట్లు దాటిన చిత్రాలుగా ఉన్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు `కల్కి` కూడా చేరింది. నార్త్ అమెరికాలో నాన్ బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసింది. ఇలా మరిన్ని రికార్డులను బ్రేక్ చేసే దిశగా వెళ్తుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఆ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓటీటీ రిలీజ్ డేట్ మ్యాటర్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా సౌత్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా, హిందీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే సినిమా త్వరలోనే ఓటీటీలో రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఫ్యాన్స్ చాలా మంది ఓటీటీలో మళ్లీ చూడొచ్చని వెయిట్ చేస్తున్నారు. ఈ నెలాఖరు అంటూ, వచ్చే మంత్‌లోనే అంటూ రూమర్స్ వస్తున్న నేపథ్యంలో టీమ్ నుంచి క్లారిటీ వచ్చింది.
`కల్కి 2898 ఏడీ` ఓటీటీలో వచ్చేది ఎప్పుడో తేల్చి చెప్పింది. ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న ఆడియెన్స్ కి షాక్ ఇచ్చాయి అమెజాన్, నెట్ ఫ్లిక్స్. సినిమా ఇప్పట్లో రాదని తేల్చి చెప్పింది. పది వారాల తర్వాతనే ఓటీటీలో రిలీజ్ అవుతుందని స్పష్టం చేశాయి. అంటే రెండున్నర నెలల తర్వాతనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంటే సెప్టెంబర్ లో `కల్కి` ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని చెప్పొచ్చు.
మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ అంశాలను, భవిష్యత్ ని జోడించి దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన మ్యాజిక్ `కల్కి`. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, విజయ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ నటించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలైన విషయం తెలిసిందే. అశ్వనీదత్ నిర్మించారు.
