సమ్మర్ బరిలో సర్కారు వారి పాట(Sarkaru vaari paata) దిగుతుంది. ప్రమోషన్స్ మాత్రం మూడు నెలలకు ముందే స్టార్ట్ చేశారు. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ప్రోమో నేడు విడుదల చేశారు.  

సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu)సరికొత్తగా కనిపిస్తున్నారు. ఆయన మాస్ లుక్ చూస్తుంటే సర్కారు వారి పాట మరో బ్లాక్ బస్టర్ గా ఆయన ఖాతాలో చేరుతుందనిపిస్తుంది. దర్శకుడు పురుశురాం సర్కారు వారి పాట విజువల్ ట్రీట్ అంటూ ఫ్యాన్స్ కి హామీ ఇస్తున్నారు. ఆయన మాటల్లో నిజమెంతుందో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. గీత గోవిందం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పరుశురాం మహేష్ తో మూవీ ఆఫర్ పట్టేయడమంటే మాములు విషయం కాదు. 

కాగా నేడు సర్కారు వారి మూవీలోని ఫస్ట్ సింగిల్ ''కళావతి'' ప్రోమో(Kalavathi song promo) విడుదల చేశారు. సాంగ్ టేకింగ్ చాలా రిచ్ అండ్ కలర్ ఫుల్ గా ఉంది. మహేష్, కీర్తి పెయిర్ చాలా అందంగా ఉంది. స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ కళావతి సాంగ్ పాడారు. కెరీర్ లో మొదటిసారి మహేష్ సాంగ్ పడుతున్నారు సిద్ శ్రీరామ్. ప్రోమో సాంగ్ పై అంచనాలు పెంచేసింది. సర్కారు వ్ వారి పాట మూవీలో ఇది బెస్ట్ సాంగ్ కావచ్చు. 

థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ కి యంగ్ రైటర్ అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఇక యూట్యూబ్ లో విడుదలైన నిమిషాల్లో కళావతి సాంగ్ వైరల్ గా మారింది. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న పూర్తి లిరికల్ సాంగ్ విడుదల చేయనున్నారు. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట తెరకెక్కుతుంది. 

Scroll to load tweet…

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలక రోల్స్ చేస్తున్నారు. మే 12న సర్కారు వారి పాట గ్రాండ్ గా విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన సర్కారు వారి పాట సమ్మర్ కి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే.