కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఫ్యామిలీ ఫ్రెండ్ కమ్ బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు వేయనుంది. మరో మూడు రోజుల్లో అనగా అక్టోబర్ 30న కాజల్ వివాహ వేడుక జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ వేడుక చాలా నిరాడంబరంగా జరగనుందట. కేవలం బంధువులు మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నారని సమాచారం. కాజల్ కుటుంబ సభ్యులు ఈ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. 

కాజల్ దసరా వేడుకను కాబోయేవాడు గౌతమ్ తో కలిసి జరుపుకుంది. వారి దసరా సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ కావడం జరిగింది. సాంప్రదాయ బట్టలలో ఈ కొత్త జంట అలరించారు. కాగా నేడు కాజల్ తన లవ్లీ సన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కొడుకు ఈషాన్ వలేచా నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈషాన్ 3వ ఏట అడుగిడుతున్న సంధర్భంగా కాజల్ ఈ పోస్ట్ పెట్టారు. 

తనకు అపరిమితమైన ప్రేమ అంటే ఏమిటో నేర్పిన ఈషాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు, నా  ఆశీర్వాదాలు, ప్రేమ నీకు ఎప్పుడూ ఉంటాయి. సుఖంగా ఉండు అని... కాజల్ తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో విషెష్ పోస్ట్ చేశారు. ఏమైంది ఈవేళా, సోలో వంటి హిట్ చిత్రాలలో నటించిన నిషా అగర్వాల్ 2013లో  వ్యాపారవేత్త కరణ్ వలేచాను వివాహం చేసుకున్నారు. వీరికి 2018 అక్టోబర్ 27న ఈశాన్ పుట్టాడు. చెల్లి కుమారుడిని కాజల్ ఎంతగానో ప్రేమిస్తుంది.