బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన 'క్వీన్' సినిమాకి రీమేక్ గా సౌత్ లో సినిమాలను రూపొందిస్తున్నారు. నాలుగు భాషల్లో సినిమా తెరకెక్కుతోంది. ఒకేసారి దక్షిణాది మొత్తం విడుదల చేయాలనేది ప్లాన్. అయితే తమిళ వెర్షన్ వచ్చేసరికి మాత్రం 'క్వీన్' రీమేక్ కి చిక్కులు తప్పడం లేదు. తమిళ రీమేక్ లో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. రమేష్ అరవింద్ దర్శకుడు.

'పారిస్ పారిస్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఇప్పుడు సెన్సార్ ఇబ్బందుల్లో పడింది. తాజాగా సినిమా చూసిన సెన్సార్ అధికారులు సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అంతేకాదు సినిమాలో చాలా వరకు ఆడియో, వీడియో కట్స్ సూచించడంతో యూనిట్ షాక్ అయింది. నిజానికి సినిమా టీజర్ వచ్చినప్పుడే అడల్ట్ కంటెంట్ ఉంటుందని చాలా మంది ఊహించారు.

మిగిలిన మూడు భాషల్లో వచ్చిన టీజర్లు బాగానే ఉన్నప్పటికీ తమిళ టీజర్ లో మాత్రం డోస్ కాస్త ఎక్కువగా ఉంది. టీజర్ లో కాజల్ వక్షభాగాన్ని మరోనటి పట్టుకోవడం సంచలనంగా మారింది. సినిమాలో అలాంటి సన్నివేశాలు, బూతు డైలాగులు చాలానే ఉన్నాయనే విషయం సెన్సార్ నిర్ణయంతో మరోసారి ప్రూవ్ అయింది. మిగిలిన భాషల్లో కూడా సినిమాను బోల్డ్ గా తీయాలనే అనుకున్నారు కానీ హీరోయిన్లు అభ్యంతరం చెప్పడంతో క్లీన్ గా తెరకెక్కాయి.

కానీ కాజల్ మాత్రం ఎలాంటి అభ్యంతరాలు  చెప్పకపోవడంతో సినిమాను కాస్త బోల్డ్ గా చిత్రీకరించారు. ప్రస్తుతం సినిమా యూనిట్.. సెన్సార్ వారిపై గుర్రుగా ఉన్నారు. రివ్యూ కమిటీని ఆశ్రయించే పనిలో ఉన్నారు.