టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలకు సరితూగే భామలు దొరకడం లేదు. ఫామ్ లో ఉన్న రష్మిక - పూజ హెగ్డేలు బిజీ బిజీగా మారిపోయారు. సీనియర్ హీరోయిన్స్ తో నటించడానికి అగ్ర కథానాయకులు ఒప్పుకోవడం లేదు. అందుకే వుమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ పై సీనియర్ నటీమణులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

అయితే టాలీవుడ్ చందమామ కాజల్ కి ఇటీవల అలాంటి ఒక అఫర్ రాగా అమ్మడు రెమ్యునరేషన్ తో బయపెడుతున్నట్లు ఇన్ సైడ్ టాక్. దర్శకుడు ఓంకార్ రాజుగారి గది 3 కోసం కాజల్ ని సంప్రదించగా అమ్మడు ప్రస్తుతం తీసుకున్నదానికంటే ఎక్కువే చెప్పినట్లు తెలుస్తోంది. 

గత ఏడాది వరకు అమ్మడు 2కోట్ల పారితోషికం తీసుకోగా అవకాశాలు తగ్గడంతో ఒకటిన్నరకు వచ్చింది. ఇక ఇటీవల సీత డిజాస్టర్ గా నిలవడంతో మళ్ళీ తగ్గించిందని వార్తలు వచ్చాయి.అందుకే ఓంకార్ చందమామను కలిశాడట. కానీ పాప మాత్రం ఒకటిన్నర కంటే ఎక్కువే చెబుతూ షాక్ ఇచ్చినట్లు సమాచారం. 

ఎదో చిన్న బడ్జెట్ లో థ్రిల్లర్ కాన్సెప్ట్ ను ప్లాన్ చేసుకుంటున్న ఓంకార్ కి ఆ నెంబర్ సరితూగకపోవడంతో సైలెంట్ అయినట్లు టాక్. మొదట ఈ దర్శకుడు తమన్నాని సెలెక్ట్ చేసుకోగా ఆమె మొదట్లోనే జంపైన సంగతి తెలిసిందే. దీంతో స్టార్ డమ్ లో కాస్త తక్కువ రెమ్యునరేషన్ తో వచ్చే హీరోయిన్స్ కోసం ఓంకార్ వెతుకుతున్నాడు.