సారాంశం
సెకండ్ ఇన్నింగ్స్ లో నటిగా సినిమాల పరంగా పెద్దగా మార్పేమి లేదని, అంతా రెగ్యూలర్‌గానే ఉన్నట్టు చెప్పిన కాజల్.. కాకపోతే ఇప్పుడు బాధ్యతలు పెరిగాయని తెలిపింది.
కాజల్ అగర్వాల్.. ఫస్ట్ టైమ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. అందులోనూ యాక్షన్ మూవీ చేస్తుంది. ప్రస్తుతం ఆమె `సత్యభామ` అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. దర్శకత్వం పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. యాక్షన్ ప్రధానంగా సాగే మూవీ ఇది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
`సత్యభామ` మూవీ షూటింగ్ ప్రస్తుతం మెయినాబాద్‌లోని ఓ రిసార్ట్ లో జరుగుతుంది. ఇందులో ప్రధానంగా కాజల్, నవీన్ చంద్ర మధ్య ఫ్యామిలీ సీన్లు షూట్ చేస్తున్నారు. సినిమాలో కాజల్ సత్యభామ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. నవీన్ అమర్ అనే రైటర్ పాత్రని పోషిస్తున్నారు. కేసుల విషయంలో నవీన్.. కాజల్‌కి చాలా హెల్ప్ చేస్తుంటాడట. క్రిమినల్స్ ని పట్టుకోవడంలో నవీన్ పాత్ర ఎంతో సహకరిస్తుందని, అతను ఇచ్చిన ఫీడ్‌బ్యాక్, ఇన్ పుట్స్ తో సత్యభామ క్రిమినల్స్ ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుందని తెలుస్తుంది.
ఇక ఆన్ లొకేషన్ టూర్‌లో భాగంగా.. కాజల్ ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను మొదటి సారి లేడీ ఓరియెంటెడ్ మూవీ, అందులోనూ యాక్షన్ మూవీ చేస్తున్నట్టు చెప్పింది. యాక్షన్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పింది. చాలా బాగా ఉందని, ఇన్నాళ్లు ఇలాంటి యాక్షన్ ని మిస్ అయినట్టు చెప్పింది. ఇందులో తన పాత్ర కొత్తగా ఉంటుంది. చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుందని, ఇలాంటి పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉందని, చాలా రెట్టింపు ఎనర్జీతో వర్క్ చేస్తున్నట్టు తెలిపింది. దర్శకుడు అఖిల్, శశి బాగా తీస్తున్నారని, కథ బలంగా రాసుకున్నారని తెలిపింది.
సెకండ్ ఇన్నింగ్స్ లో నటిగా సినిమాల పరంగా పెద్దగా మార్పేమి లేదని, అంతా రెగ్యూలర్‌గానే ఉన్నట్టు చెప్పిన కాజల్.. కాకపోతే ఇప్పుడు బాధ్యతలు పెరిగాయని, చాలా సిస్టమాటిక్‌గా ఉంటున్నట్టు తెలిపింది. ఇప్పుడు తన మొదటి ప్రయారిటీ కొడుకు నీల్ కిచ్లు అని చెప్పింది. అతన్ని చూసుకోవడమే తనకు మొదటి ప్రాధాన్యత అని, ఆ తర్వాత సినిమాలైనా, ఇంకేవైనా అని చెప్పింది. నీల్ వచ్చాక లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా మారిందని చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో తన కుమారుడిని కూడా హైదరాబాద్‌కే తీసుకొచ్చినట్టు చెప్పింది.
ఇక కాజల్‌ని ఎంపిక చేయడం, గ్లామర్ గా ఉండే కాజల్‌లో యాక్షన్‌ని చూడంపై శశి కిరణ్ తిక్క స్పందిస్తూ.. కాజల్ సినిమాల్లో కూల్‌గానే, అందంగా ఉన్నారు. బయట మాట్లాడే సమయంలో ఆమెలో చాలా ఆవేశం ఉంటుందని, స్పాంటినిటీ ఉంటుందని, యాక్షన్ చేయగలదనే నమ్మకం కలిగిందని, అందుకే ఆమెని ఎంచుకున్నట్టు చెప్పాడు శశి కిరణ్ తిక్క. ఆమె అద్బుతంగా చేస్తుందని తెలిపారు.