గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న మంచు విష్ణు నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అందుకోసం హాలీవుడ్ ప్లాట్ ఫార్మ్ లోకి వెళుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ దర్శకుడితో రూపొందించనున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఇంగ్లీష్ తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. . 

అయితే సినిమాలో కాజల్ ఒక పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. సినిమాలో మంచు విష్ణు లవర్ గా కాజల్ కనిపించనున్నట్లు టాక్ వచ్చింది. అది నిజం కాదని తెలుస్తోంది. చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం సినిమాలో కాజల్ మంచు విష్ణు సోదరిగా నటించిననున్నట్లు సమాచారం. 

సినిమాలో హీరో పాత్రకు స్టార్ హీరోయిన్ అయితేనే బావుంటుందని మంచు విష్ణు ఆమెను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. అలాగే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను కూడా మంచు హీరో తెలియజేయనున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.