స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వివాహం గౌతమ్ కిచ్లూతో సంప్రదాబయబద్ధంగా జరిగిన సంగతి తెలసిందే. తన ప్రియుడు గౌతమ్‌తో ఏడడుగులు వేసి కొత్త జీవితంలోకి ఆనందంగా అడుగుపెట్టింది. లాక్‌డౌన్ కారణంగా అతి తక్కువ మంది అతిథుల మధ్య వీరి పెళ్లి వేడుక ముంబయ్‌లో ఘనంగా జరిగింది. కాజల్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి అభిమానులు మురిసిపోతున్నారు. 

ఇక కరోనా నేపథ్యంలో సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహాన్ని జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు భర్తతో కలసి హనీమూన్ ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతోంది.ఈ విషయాన్ని కాజల్ డైరెక్టుగా చెప్పనప్పటికీ, ఇన్ స్టాగ్రామ్ లో ఈ రోజు చిన్న హింట్ ఇచ్చింది. బ్యాగేజి, పాస్ పోర్టుల ఫొటోలు పోస్ట్ చేసి.. 'బ్యాగులు సర్దుకున్నాం'.. 'బయలుదేరడానికి సిద్ధంగా వున్నాం' అంటూ ఆ ఫొటోలపై క్యాప్షన్స్ ఇచ్చింది. హనీమూన్ కి వెళుతున్న విషయాన్ని అలా చెప్పకనే చెప్పేసిందన్నమాట. అయితే, ఏ ప్రదేశానికి వెళుతున్నదీ అమ్మడు చెప్పలేదు. నెటిజన్లకు విషయం అర్థం కావడంతో 'హ్యాపీ జర్నీ' అంటూ కాజల్ జంటకు విషెస్ చెబుతున్నారు. అక్కడితో  ఆగకుండా ఏ దేశం వెళ్తన్నావ్..ఎక్కడ ఏ హోటల్ లో దిగుతున్నవ్ అంటూ వరస ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. అదే పెద్ద టాపిక్ అయ్యి కూర్చుంది సోషల్ మీడియాలో..మరి ఆమె సమాధానం చెప్తుందా..అనవసరంగా మ్యాటర్ లీక్ చేసేనే అని తల గోక్కుంటుందా అనేది ఇప్పుడు అందరి మదిలో ప్రశ్న. 

కాజల్ అగర్వాల్ వివాహం తర్వాత కూడా సినిమాలలో నటిస్తానని ఇప్పటికే చెప్పింది. అటు సంసారం.. ఇటు వృత్తి రెంటికీ సమ ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటోంది. ఇక ‘లక్ష్మి కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన అందాల తార కాజల్ ‘మగధీర’ చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ఇటీవల ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మంచి హిట్‌ను అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’, కమల్‌హాసన్‌తో ‘ఇండియన్–2’, మంచు విష్ణుతో ‘మోసగాళ్లు’ సినిమాల్లో నటిస్తోంది. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని కాజల్ తాజాగా చెప్పింది.