Asianet News TeluguAsianet News Telugu

జ్వాల సినిమాతో పాన్ ఇండియాకు విజయ్‌ ఆంటోనీ, అరుణ్‌ విజయ్‌, టీజర్‌ ట్రీట్ ఇచ్చిన టీమ్

సాహో ఫేమ్‌ అరుణ్‌ విజయ్, బిచ్చగాడు ఫేమ్‌ విజయ్‌ ఆంటోని కలిసి నటించిన  సినిమా జ్వాల. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి  రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేశారు టీమ్. 

Jwala Movie Teaser Release
Author
Hyderabad, First Published May 27, 2022, 5:22 PM IST

పాత రోమ్‌ నగరం గుర్తుందా మిత్రుడా! ఇద్దరు గ్లాడియేటర్స్‌ తలపడతారు, ఓడినవాడు చస్తాడు గెలిచినవాడు మాత్రమే బ్రతుకుతాడు...బతికుంటే అలాంటి ఒక గెలుపుతో బతికుండాలి. చచ్చినాకూడా అలాంటి వాడి చేతిలో చచ్చాము అనే గర్వంతో చావాలి. ఇటువంటి పవర్‌ఫుల్‌ డైలాగ్స్ తో జ్వాల టీజర్‌ను  శుక్రవారం ప్రముఖ నటుడు ఆలిండియా యాక్టర్‌ రానా దగ్గుబాటి సోషల్‌ మీడియా ట్వీట్టర్‌ ద్వారా  విడుదల చేశారు. 

ఆర్‌ఆర్‌ఆర్‌,కె.జి.ఎఫ్‌–2, విక్రమ్‌ లాంటి పాన్‌ఇండియా సినిమాల ను ఫాలో అవుతూ.. వాటి సరసన చేరనుంది జ్వాల. ఈ టీజర్‌ కూడా ఇంచుమించు ఆ సినిమాల స్థాయిలోనే  ప్లాన్ చేసినట్టు మూవీ టీమ్ వెల్లడించింది. సాహో ఫేమ్‌ అరుణ్‌ విజయ్, బిచ్చగాడు ఫేమ్‌ విజయ్‌ ఆంటోని కలిసి నటించిన ఈ మూవీ టీజర్‌లో  ఇద్దరు స్టార్ లు పోటాపోటీగా నటించారు.  

 

అక్షరహాసన్‌ కీలక పాత్రలో నటించిన జ్వాల సినిమాను  పాన్‌ ఇండియా మూవీగా  అమ్మ క్రియేషన్స్‌ సమర్పిస్తుండగా శర్వాంత్‌రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై జవ్వాజి రామాంజనేయులు, షిరిడిసాయి మూవీస్‌ పతాకంపై యం.రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారు. 

రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, స్విట్జర్లాండ్, కలకత్తాలతో పాటు అనేక దేశాల్లో షూటింగ్‌ జరుపుకుంది ఈ మూవీ. అరుణ్‌విజయ్, విజయ్‌ ఆంటోనీ, అక్షరహాసన్‌ల కెరీర్‌లోనే తెరకెక్కిన భారీబడ్జెట్‌ చిత్రం  జ్వాల. ఈ  సినిమాకు   నవీన్‌ డైరెక్ట్ చేయగా... ప్రకాశ్‌రాజ్, రైమాసేన్,నాజర్‌ లాంటి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios