తమిళ దర్శకునితో జట్టుకడుతున్న జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి అందుబాటులో లేని టాలీవుడ్ బడా దర్శకులు సింగం సినిమాల దర్శకుడు హరితో తారక్ తదుపరి సినిమా

జనతా గ్యారేజ్ సినిమా తర్వాత తారక్ చేయబోయే చిత్రం ఏంటన్నది ప్రస్తుతానికి ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. జనతా గ్యారేజ్ కంటే ముందు తారక్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నటిస్తాడని ప్రచారం సాగింది. కానీ కొరటాల శివ మేకింగ్ జనతాగ్యారేజ్ జూనియర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో కెరీర్ లో బెస్ట్ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా విషయంలో తొందర పడటం లేదు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలు భారీ విజయాలుగా నమోదయ్యాయి. తర్వాత చేయబోయే చిత్రం కూడా ఆ రేంజ్ లో ఉండాలని యంగ్ టైగర్ కోరుకుంటున్నాడు.

జనతా గ్యారేజ్ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడని జోరుగా ప్రచారం సాగింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటించాలంటే అందుకు త్రివిక్రమ్ అయితేనే కరెక్ట్ అని తారక్ భావించాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి టాలీవుడ్ మాట్లాడుకుంటుండగానే మాటల మాంత్రికుడు.. పవన్ తొ కొత్త సినిమాను ప్రారంభించాడు. ఈ దశలో టాలీవుడ్ లో మరో దర్శకుడు అందుబాటులో లేకపోవడంతో.. తారక్ చూపు కోలీవుడ్ దర్శకుడిపై పడినట్లు టాక్ వినిపిస్తోంది.

సింగం చిత్రాల దర్శకుడు హరితో తారక్ సినిమా చేసే అవకాశం ఉందంట. అదే నిజమైతే.. తారక్ కొత్త సినిమా మాంచిమాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరించడం ఖాయం.హరి ప్రస్తుతం సింగం 3 రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. డిసెంబర్ 16 న ఈ చిత్రం విడుదల కానుంది. సింగం 3 తర్వాత నిజానికి హరి విక్రమ్ తో సామి 2 తీయాలి కానీ.. ఆ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడినందువలనే తారక్ సినిమా చేయాలని ఆరాట పడుతున్నాడట.