Asianet News TeluguAsianet News Telugu

వెకిలి చేష్టలతో యువతులను వేధించిన జూనియర్ ఆర్టిస్ట్!

మహిళలను గౌరవించమని ఎన్ని చట్టాలు వస్తున్నా.. కొందరు ఆకతాయిలు మాత్రం మహిళలను వేధిస్తూ ఆనందాన్ని పొందుతూ కటకటాల పాలవుతున్నారు. నిమజ్జనం చూడడానికి వచ్చిన కొందరు అమ్మాయిలను సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించిన కొందరు ఆకతాయిలను న్యాయస్థానం శిక్షించింది.

junior artist arrested for misbehaving with girls
Author
Hyderabad, First Published Oct 4, 2018, 12:02 PM IST

మహిళలను గౌరవించమని ఎన్ని చట్టాలు వస్తున్నా.. కొందరు ఆకతాయిలు మాత్రం మహిళలను వేధిస్తూ ఆనందాన్ని పొందుతూ కటకటాల పాలవుతున్నారు. నిమజ్జనం చూడడానికి వచ్చిన కొందరు అమ్మాయిలను సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించిన కొందరు ఆకతాయిలను న్యాయస్థానం శిక్షించింది.

గత నెలలో జరిగిన గణేష్ నిమజ్జనం చూడడం కోసం ట్యాంక్‌బండ్‌ కి వచ్చిన అమ్మాయిలను సుసికాంత్ పాండ అనే యువకుడు వీడియో తీశాడు. అది గమనించిన షీటీమ్ అతడిని పట్టుకున్నారు. అలానే మరికొంతమంది యువకులు అమ్మాయిల పర్మిషన్ లేకుండా వారి వీడియోలను చిత్రీకరించారు.

వారిని కూడా అదుపులోకి తీసుకున్న షీ బృందాలు స్పెషల్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితులకు 27 రోజుల జైలు, రూ.250 జరిమానా విధించారు.

అదే రోజు ట్యాంక్‌బండ్‌పై అమ్మాయిలని వెకిలి చేష్టలతో వేధిస్తోన్న అమీర్ పేట్ కి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ పి.కృష్ణ, మౌలాలీకి చెందిన బీకే దిలీప్ లను పట్టుకొని కోర్టులో  హాజరుపరిచారు. వీరితో రెండు రోజుల పాటు సామాజిక సేవ చేయించి రూ.100 జరిమానా విధించింది కోర్టు. 

Follow Us:
Download App:
  • android
  • ios