ఇండియాలో సినిమా మార్కెటింగ్ రోజురోజుకి తారా స్థాయికి చేరుకుంటోంది. భాషతో సంబంధం లేకుండా చాలా వరకు బాక్స్ ఆఫీస్ వద్ద అనేక సినిమాలు ఊహించని వసూళ్లతో షాకిస్తున్నాయి. హాలీవుడ్ సినిమాలు కూడా ఇండియాలోని స్థానిక భాషల్లోకి అనువాదం అవుతున్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. 

అవతార్ సినిమా నుంచి హాలీవుడ్ సినిమాలు తెలుగు తమిళ్ మలయాళం - హిందీ భాషల్లో అనువాదం అవుతూ వస్తున్నాయి. జంగల్ బుక్ తరువాత  ఆ డోస్ ఇంకా పెరిగింది. ఇక ఇప్పుడు జ్యూమాంజి: ద నెక్స్ట్ లెవెల్ కూడా సౌత్ లో భారీగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. డ్వేన్ జాన్సన్ నటించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ కానుంది.