ఎన్టీఆర్ కు ఆర్ ఆర్ ఆర్ తో వచ్చిన మార్కెట్ ఈ రకంగా క్యారీ ఫార్వర్డ్ అవుతుందన్నమాట. 


RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్ కు నార్త్ లో కూడా ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ తో బాలీవుడ్ స్టార్స్ కలిసి వర్క్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మరో ప్రక్క ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకి పరిచయం కాబోతోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయమై నిన్న అప్డేట్ వచ్చి అభిమానులను అలరించింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా నిమిత్తం ఎన్టీఆర్ కు అంత పెద్ద బ్యానర్ ఎంత పే చెయ్యబోతున్నారు అనేది అంతటా చర్చగా మారింది.

బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...ఎన్టీఆర్ కు 100 కోట్లు దాకా ఈ ప్రాజెక్టు ద్వారా ముట్టనుంది. అయితే ఒకేసారి మొత్తం పే చెయ్యరట. ప్రాఫిట్ షేరింగ్ పద్దతిలో ఈ ఎమౌంట్ ని ఇస్తారని వినికిడి. ఈ మేరకు ఎన్టీఆర్ సరే అని ఎగ్రిమెంట్ చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాది నుంచి ఓ పెద్ద బ్యానర్ తమ సినిమాల్లో సౌత్ నుంచి ఓ స్టార్ ని తీసుకోవటం ఈ మధ్యకాలంలో ఇదే మొదటి సారి. అలాగే ఈ ఎమౌంట్ కూడా రీజనబుల్ అని భావిస్తున్నారట. ఎన్టీఆర్ కు ఆర్ ఆర్ ఆర్ తో వచ్చిన మార్కెట్ ఈ రకంగా క్యారీ ఫార్వర్డ్ అవుతుందన్నమాట. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ 30. ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31, హిందీలో స్పై యూనివర్స్ వార్2లో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఈ లైనప్ లో ఉన్న సినిమాలతో ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందనడంలో.. ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఇక ఒక్కసారి ఎన్టీఆర్, యష్ రాజ్ స్పై యూనివర్స్ లోకి ఎంటర్ అయితే రాబోయే రోజుల్లో సల్మాన్ ఖాన్ vs ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్ vs ఎన్టీఆర్ లాంటి కాంబినేషన్స్ ని కూడా చూసే ఛాన్స్ ఉందంటున్నారు ఎందుకంటే స్పై యూనివర్స్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హ్రితిక్ రోషన్ లు హీరోలుగా నటిస్తున్నారు.

బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ,ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఫీస్ట్ చిత్రం "వార్ 2" . ఈ సినిమా షూటింగ్ 2024 మార్చి 7న జపాన్‌లోని టోక్యోలోని చారిత్రాత్మక షావోలిన్ టెంపుల్‌లో ప్రారంభం కానుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ అవైటెడ్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ షూట్ లో ఏప్రిల్ నుంచి జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి ప్రఖ్యాత ఆస్ట్రేలియా సినిమాటోగ్రాఫర్ బెన్ జాస్పర్ కెమెరాను హ్యాండిల్ చేయబోతున్నారు. ఇక ఈ భారీ చిత్రానికి యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్ కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.