Asianet News TeluguAsianet News Telugu

అన్న కోసం మరోసారి ఎన్టీఆర్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ?

బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రాజేంద్ర రెడ్డి దర్శకుడు కాగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

Jr NTR To attend Kalyan ram Amigos prerelease event
Author
First Published Feb 4, 2023, 10:45 AM IST

బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రాజేంద్ర రెడ్డి దర్శకుడు కాగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే తొలిసారి ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నారు. 

ఉత్కంఠ రేపే థ్రిల్లర్ గా ఈ చిత్రం సాగనుంది. ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 5న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తమ్ముడు వస్తున్నాడు. అక్కడ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం అని కళ్యాణ్ రామ్ తెలిపారు. మరోసారి అన్న కోసం తారక్ వస్తుండడంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. బింబిసారా చిత్రానికి తారక్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. 5వ తేదీన జెఆర్సీ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. 

అయితే బింబిసారా చిత్రానికి ఉన్నత బజ్ అమిగోస్ కి ఇంకా క్రియేట్ కాలేదు. ఎన్టీఆర్ రాకతో అయినా బజ్ పెరుగుతుందేమో చూడాలి. బింబిసారా చిత్రంలో కళ్యాణ్ రామ్ నెగిటివ్ అండ్ పాజిటివ్ షేడ్స్ లో అదరగొట్టేశాడు. అమిగోస్ లో ట్రిపుల్ రోల్ లో ఎలా నటించాడనే ఉత్కంఠ నెలకొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios