ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా ఎలాగూ సూపర్ హిట్ అవుతుంది. ఎన్టీఆర్ బిజినెస్ రెట్టింపు అవుతుంది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ తదుపరి చేయబోయే చిత్రం పై అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. ప్రాజెక్టు అనుకోగానే బిజినెస్ అయ్యిపోతుంది. ఇలా లెక్కలు వేసి దర్శక,నిర్మాతలు అంతా ఎన్టీఆర్ నెక్ట్స్ తమకు చేస్తే బాగుండును అని భావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఆలోచన ఎలా ఉంది. ఆయన ఏ దర్శకుడుతో సినిమా చేయబోతున్నారు అనే విషయమై ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. 

ఆర్ ఆర్ ఆర్ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తదుపరి సినిమా వుండనుందనేది తాజా సమాచారం. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనని కొంతమంది అభిమానులు కలుసుకున్నప్పుడు ఈ టాపిక్ వచ్చిందిట. ఆ సమయంలో రాజమౌళితో చేస్తోన్న సినిమా తరువాత ఏ దర్శకుడితో తదుపరి సినిమా ఉంటుందని అభిమానులు అడిగిన ప్రశ్నకి ఆయన త్రివిక్రమ్ పేరు చెప్పినట్టుగా స‌మాచారం. త్రివిక్రమ్ తో ఇంతకు ముందు ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ అనే చిత్రం చేసారు. సినిమా సూపర్ హిట్ కాకపోయినా భాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకుంది. దాంతో మరో సారి త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఎన్టీఆర్ భావించి ఈ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. 

అయితే ఈ సంవత్సరం త్రివిక్రమ్ తో సినిమా ఉండదు. పూర్తిగా ఆర్ ఆర్ ఆర్ పైనే ఎన్టీఆర్ దృష్టి పెడతారు. ఈ సినిమా తర్వాత మాత్రమే ఆ ప్రాజెక్టులోకి వెళ్తారు. మరో ప్రక్క త్రివిక్రమ్ సైతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా మొదలెెడతారు.