Asianet News TeluguAsianet News Telugu

క్రిటికల్ గా TNR హెల్త్ కండీషన్.. కోమాలో..?


ప్రాంక్లీ విత్ టి యన్ ఆర్ షో తో పాపులరైన జర్నలిస్ట్ టిఎన్నార్. ఆయన కరోనా బారిన పడి,హాస్పటిల్ లో జాయిన్ అయ్యారు. ఆరోగ్య పరిస్దితి క్రిటికల్ గా ఉంది. పల్స్ రేటు బాగా పడిపోయింది. 

Journalist TNRs Health Turns Critical jsp
Author
Hyderabad, First Published May 9, 2021, 12:33 PM IST

 సెకండ్ వేవ్ లో  అనేకమంది జర్నలిస్టులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాలతోపాటు, జిల్లా కేంద్రాల్లో, రాజధానిలో పనిచేస్తున్న పలువురు మీడియా ప్రతినిధులు కరోనాకు టార్గెట్ అవుతున్నారు. అనేకమంది వ్యాధి లక్షణాలు పెద్దగా లేకుండానే, స్వల్ప అస్వస్థతతో, ఆస్పత్రిలో చేరిన ఒకట్రెండు రోజుల్లోనే ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు, కోలుకున్న వారు కోలుకుంటున్నారు.లేనివారు లేదు అన్నట్లు తయారైంది. 

ప్రాంక్లీ విత్ టి యన్ ఆర్ షో తో పాపులరైన జర్నలిస్ట్ టిఎన్నార్. ఆయన కరోనా బారిన పడి,హాస్పటిల్ లో జాయిన్ అయ్యారు. ఆరోగ్య పరిస్దితి క్రిటికల్ గా ఉంది. పల్స్ రేటు బాగా పడిపోయింది. ఆల్మోస్ట్ కోమా పరిస్దితులో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు మరో జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పెట్టారు. క్రితం నెలలో టీఎన్నార్ సోదరికు కరోనా పాజిటివ్ వచ్చి వెంటిలేటర్ మీద పెట్టారు. అయితే ఆమె మెల్లిగా కోలుకుని బయిటపడ్డారు. ఇప్పుడు టీఎన్నార్ కరోనా బారిన పడటం , అదీ సీరియస్ అవటం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన త్వరగా కోలుకుని రావాలని ప్రార్ధిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన కాచిగూడలోని ఎస్‌వీఎస్‌ ప్రైవేట్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా టీఎన్నార్..వరస బెట్టి సినిమాలు చేస్తున్నారు. సినిమాల్లో నటుడుగా ఆయనకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఏప్రియల్ 24 కూడా తను ఓ సినిమా షూటింగ్ లొకేషన్ లో ఉన్నానని ఓ స్టిల్ షేర్ ఫేస్ బుక్ లో చేసారు. ఇంతలోనే ఆయనకు కరోనా ఎటాక్ అయ్యింది.
 
ఇక కరోనా సోకిన చాలా మంది జర్నలిస్టులకు ట్రీట్​మెంట్​ చేయించుకునే స్థోమత కూడా లేదు. కొందరు జర్నలిస్టులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్నా.. ఇంకొందరికి బెడ్లు దొరకని పరిస్థితి. అక్రెడిటేషన్​ ఉన్నోళ్లకు హెల్త్​కార్డులున్నా అవి కరోనా ట్రీట్​మెంట్​కు ఎందుకూ పనికిరావడం లేదు. దీంతో కొందరు జర్నలిస్టులు బయటి నుంచి లక్షల్లో అప్పులు తెచ్చి ట్రీట్​మెంట్​ చేయించుకోవాల్సిన పరిస్థితులున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios