కొన్ని హాలీవుడ్ చిత్రాలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి. అందులో క్రేజీ హీరో జానీ డెప్ నటించిన పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సిరీస్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్ ద్వారానే జానీ డెప్ అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో ఒకడిగా నిలిచాడు. ప్రస్తుతం జానీ డెప్ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ అంబర్ హార్డ్ ని జానీ డెప్ 2015లో వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత వీరి వివాహ జీవితంలో విభేదాలు తలెత్తాయి. 

దీనితో ఈ జంట 2017లో విడిపోయారు. విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జానీ డెప్,అంబర్ హార్డ్ మధ్య ఆరోపణలు తీవ్రస్థాయికి చేరాయి. జానీ డెప్ తన మాజీ భార్యపై సంచలన ఆరోపణలు చేస్తూ కోర్టులో పరువునష్టం దావా వేశాడు. కొన్ని రోజుల క్రితం అంబర్ హార్డ్ కూడా డెప్ పై కేసు నమోదు చేసింది. వివాహం తర్వాత డెప్ తనని చిత్రవధకు గురిచేసేవాడని ఆరోపించింది. 

తనపై అంబర్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని, ఆమె వల్ల తాను సినిమా అవకాశాలు కూడా కోల్పోతున్నానని డెప్ వాపోయాడు. తాజాగా అంబర్ హార్డ్ పై వేసిన పరువునష్టం దావాలో డెప్ సంచలన ఆరోపణలు చేశాడు. అంబర్ హార్డ్ సాధారణ మహిళా కాదు అని, వ్యసనపరురాలు అని తెలిపాడు. విపరీతంగా మద్యం, డ్రగ్స్ తీసుకునే అలవాటు ఆమెకు ఉందని డెప్ వివరించాడు. దీనివల్ల ఇంట్లో అనేకసార్లు దాడులకు గురయ్యానని డెప్ వాపోయాడు. 

మద్యం, డ్రగ్స్ సేవించిన తర్వాత అంబర్ హార్డ్ ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తుంది. మద్యం బాటిళ్లు, సోడా బాటిల్స్, పెయింటింగ్ క్యాన్స్ ఇలా చేతికి ఏది దొరికితే దానితో దాడికి పాల్పడేదని డెప్ తెలిపాడు. అంబర్ మద్యం సేవించి ఉండడంతో తప్పించుకోవడానికి మాత్రమే ప్రయత్నించేవాడిని.. ఆమెని ఏమీ అనేవాడిని కాదు అని తెలిపాడు. 

సాధారణంగా ఇలాంటి పరిస్థితిని మహిళలు ఎదుర్కొంటుంటారు. కానీ జానీ డెప్ తనకు ఈ పరిస్థితి ఎదురైందని చెప్పడం ఆసక్తిగా మారింది. కొన్ని సందర్భాల్లో అంబర్ తన స్నేహితురాళ్ళని వెంటబెట్టుకుని ఇండికి వచ్చేది. వారు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మద్యం మత్తులో తన బెడ్ రూమ్ ని వాళ్ళు బాత్ రూమ్ తరహాలో ఉపయోగించుకునేవారు అంటూ డెప్ ఆరోపించాడు. అంబర్ నుంచి విడిపోయిన తర్వాత డెప్ ని పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ చిత్రం నుంచి డిస్ని సంస్థ తొలగించిన సంగతి తెలిసిందే.