Asianet News TeluguAsianet News Telugu

పఠాన్ విలన్ మామూలోడు కాదుగా.. పాత బంగ్లా కోసం రూ 75 కోట్లు తగలేశాడు

జాన్ అబ్రహం ముంబైలో ఖర్ లింకింగ్ రోడ్డు వద్ద ఉన్న భారీ బంగ్లా ని ఏకంగా 75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడట. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఆ బంగ్లా చాలా పాతదని తెలుస్తోంది.

John abraham buys 75 crores property in mumbai dtr
Author
First Published Jan 1, 2024, 5:25 PM IST

ఇటీవల బాలీవుడ్ లో ఎక్కడా చూసినా నటీనటులు కోట్లాది రూపాయలతో ప్రాపర్టీలు కొంటున్నారు. ఆ వార్తలు వైరల్ అవుతున్నాయి.ప్రాపర్టీలు కొనడం మాత్రమే కాదు జాన్వీ కపూర్ లాంటి వాళ్ళు అమ్మేస్తున్నారు కూడా. ఇటీవల కపూర్ సిస్టర్స్ ఇద్దరూ 12 కోట్ల రూపాయల అపార్ట్మెంట్స్ ని అమ్మేసిన వార్తలు వైరల్ అయ్యాయి. 

తాజాగా మరో క్రేజీ హీరో కోట్లాది రూపాయలతో కొత్త బంగ్లా కొనుగోలు చేశాడు. ఆ హీరో ఎవరో కాదు పఠాన్ చిత్రంలో డెడ్లీ విలన్ గా నటించిన జాన్ అబ్రహం. జాన్ అబ్రహం 20 ఏళ్లుగా బాలీవుడ్ లో రాణిస్తున్నాడు. 

జాన్ అబ్రహం ముంబైలో ఖర్ లింకింగ్ రోడ్డు వద్ద ఉన్న భారీ బంగ్లా ని ఏకంగా 75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడట. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఆ బంగ్లా చాలా పాతదని తెలుస్తోంది. అయినా కూడా జాన్ అబ్రహం ఎంతో ఇష్టపడి ఆ బంగ్లాని 75 కోట్ల తో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ బంగ్లా ని జాన్ అబ్రహం డిసెంబర్ 27నే కొన్నాడట. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. బంగ్లా విలువ 70 కోట్లు కాగా మరో 5 కోట్లు స్టాప్ డ్యూటీ కోసం అయినట్లు తెలుస్తోంది. పాత బంగ్లాని కూల్చేసి కొత్త ఇంటిని జాన్ అబ్రహం నిర్మించుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జాన్ అబ్రహం నిర్మించబోయేది ఇల్లు కాదని హోటల్ లాంటి కమర్షియల్ బిల్డింగ్ నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios