దర్శకధీరుడు రాజమౌళి 'RRR' సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా సినిమా తెరకెక్కనుంది. రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా అలియా భట్ కనిపించనుంది. ఎన్టీఆర్ సరసన ఓ ఫారెన్ అమ్మాయిని తీసుకోవాలని భావించారు.

ప్రెస్ మీట్ లో ఆమె పేరు కూడా అనౌన్స్ చేశారు. కానీ ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో కథలో కొన్ని మార్పులు చేసి అసలు ఫారెన్ అమ్మాయి అవసరం లేకుండా చేశారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే జాన్వీ ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి పెద్దగా ఆసక్తి లేదట. దీంతో ఆమె ప్రాజెక్ట్ ని రిజెక్ట్  చేసిందని టాక్. సినిమాలో ఆమె పాత్ర కంటే అలియా భట్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో జాన్వీ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. 

గతంలో జాన్వీ తల్లి శ్రీదేవి కూడా రాజమౌళి ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. నిజానికి 'బాహుబలి'లో శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని అనుకున్నారు. కానీ ఆమె రెమ్యునరేషన్ అధికంగా అడగడంతో రాజమౌళి డ్రాప్ అయ్యారు. ఇప్పుడు తల్లిలానే కూతురు కూడా రాజమౌళి సినిమా కాదనుకుందని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది.