ధఢక్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మంచి ఆఫర్స్ ను అందుకుంటోంది. శ్రీదేవి కూతురిగా చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటున్న అమ్మడు ఊహించని ప్రాజెక్టులను ఓకె చేస్తోంది. రీసెంట్ గా దోస్తానా సినిమా సీక్వెల్ కి కూడా బేబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

2008లో వచ్చిన దోస్తానా సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అయితే పదేళ్ల తరువాత ఆ కామెడీ ఎంటర్టైనర్ కు సీక్వెల్ సిద్ధమైంది. కరణ్ జోహార్ సీక్వెల్ కి సంబందించిన యూనిట్ పై ఇటీవల స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. 

కార్తీక్ ఆర్యన్ - జాన్వీ ని ప్రధాన పాత్రధారులుగా ఫైనల్ చేసిన నిర్మాతలు మరో యువ హీరో కోసం వెతుకుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.  ఎలాగైనా దోస్తానా 2తో సక్సెస్ అందుకోవాలని జాన్వీ ఆశపడుతోంది. అమ్మడు ప్రస్తుతం కార్గిల్ గర్ల్ అనే సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.