తన లైఫ్ స్టైల్, డ్రెస్సింగ్ గురించి నెటిజన్లు రోజూ సోషల్ మీడియాలో విమర్శిస్తూనే ఉన్నారని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకి సోషల్ మీడియా వలన వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్నారా..? అనే ప్రశ్న ఎదురైంది.

దీనికి సమాధానంగా జాన్వీ.. ''నా జీవన విధానం, డ్రెస్సింగ్ గురించి ప్రతిరోజూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాను. సోషల్ మీడియా వినియోగం నన్ను చాలా బాధిస్తోంది. దానివలన చాలా సమస్యలు వస్తున్నాయి. చాలా మంది నా లైఫ్ స్టైల్ గురించి విమర్శలు చేస్తుంటారు. 

ఆ విమర్శలు నిజమేనా అని ఆలోచించుకునేదాన్ని.. నెటిజన్ల తీరు పట్ల విచారంగా ఉంది. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం  బాధాకరం. ఈ విమర్శలను ఎదుర్కోవడం తప్ప మనమేం చేయలేం'' అంటూ చెప్పుకొచ్చింది.

'ధడక్' సినిమాతో నటిగా పరిచయమైన జాన్వీ ప్రస్తుతం మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తోంది. అలానే 'తఖ్త్' సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. కరణ్ జోహార్ రూపొందిస్తోన్న ఈ సినిమాలో జాన్వీతో పాటు అలియాభట్, కరీనా కపూర్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ వంటి తారలు నటిస్తున్నారు.