న్యాచురల్ స్టార్ నాని హీరోగా మళ్ళి రావాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం జెర్సి.  ఈ సినిమా క్లైమాక్స్ గురించి గత కొద్ది రోజులుగా మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఒక సుఖాంతం, మరొకటి కథ ప్రకారం విషాదాంతం క్లైమాక్స్ షూట్ చేసారని  దిల్ రాజు, త్రివిక్రమ్   షో చూసి  ఫైనల్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను చిత్ర యూనిట్  ఖండించింది.  

ఆ వార్తలన్నీనిజం కాదని టీమ్ అంటోంది. ‘జెర్సీ’ సెట్స్‌పైకి వెళ్లకముందే క్లైమాక్స్‌ ఖరారైపోయిందని, ఎలాంటి మార్పూ చేయలేదని పేర్కొటోంది. అయితే నిప్పు లేనిదే పొగ ఎలా వస్తుందని, అసలు క్లైమాక్స్ మ్యాటర్ లో ఏదో విషయం లేకపోతే ఎందుకు ఇలాంటి వార్తలు వస్తాయని కొందరు వాదిస్తున్నారు. 

దాదాపు  షూటింగ్  పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్  హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇక ఈ మూవీ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది.  కథ  ప్రకారం  80-90 దశకం మధ్య జరిగిన కథ ఇది.   36 ఏళ్ళ వయసులో కొత్తగా ఏమీ చేయడానికి లేని ఒక యువకుడు 1996-97 రంజీ ట్రోఫీ ద్వారా ప్రూవ్ చేసుకుని తానేంటో మళ్ళి ప్రపంచానికి చాటాడమే కీలకాంశం.  జెర్సిలో నాని  పాత్ర పేరు అర్జున్  . అప్పట్లో సంచలన స్టార్ గా పేరున్న రమణ్ లాంబా జీవత కథగా ఈ సినిమా రూపొందుతోందని టాక్.