రెండేళ్ల క్రితం ‘ఎం ఎం ఓ ఎఫ్’ అనే సినిమాలో లీడ్ రోల్ లో కనిపించిన జేడి.. చాలా గ్యాప్ తర్వాత ‘దయ’ అనే సరికొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  


ఓటిటిలు వచ్చాక... రియలిస్టిక్‌ కథనాలతో తెరకెక్కుతోన్న థ్రిల్లర్‌ సినిమాలు, వెబ్ సీరిస్ లు చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లను ఓటీటీ ఆడియెన్స్‌ ముందుకు తెస్తున్నాయి. అలా జెడీ చక్రవర్త ప్రధాన పాత్రలో రెడీ అయ్యిన మరో ఇంటెన్స్‌ థ్రిల్లర్‌ సీరిస్ త్వరలో డిస్నీ ఓటీటీలో రానుంది. వివరాల్లోకి వెళితే...

జేడీ చక్రవర్తి కు ఓ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయన రెగ్యులర్ గా సినిమాలు చేయటం లేదు. కొంత కాలం సినిమాల్లో కనిపించడని జేడి.. తాజాగా దయ సీరిస్ తో మన ముందుకు రాబోతున్నారు. ఈ సీరిస్ త్వరలో ఓటీటీలో రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సీరిస్ ప్రమోషన్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ చాలా ఇంటెన్స్ తో చిన్న పాటి సస్పెన్స్ తో మొదలైంది. జేడీ చక్రవర్తి లారీ డ్రైవర్ పాత్రలో ..ఒక చెవి మాత్రమే వినపడే వ్యక్తిగా డిఫరెంట్ గా కనపడ్డారు. జేడీ కెరీర్ లో గొప్పగా చెప్పబడే సత్య సినిమానాటి జేడీ మళ్లీ ఇన్నాళ్లకు కనపడ్డాడనిపిస్తోంది. 

ఈ ట్రైలర్ లో కవితా నాయుడు అనే జర్నలిస్ట్ మిస్ అవటం..పోలీస్ లు ఇన్విస్టిగేషన్ ...మరో ప్రక్క ఆమె శవం...దయ లారిలో కనపడటం...ఏదో మిస్టరీ ఉందని అర్దమవుతుంది.చావు ప్రాణం తీస్తుంది. భయం నిజాన్ని దాస్తుంది అంటూ ఫృద్వీ చెప్పే డైలాగు సీరిస్ పై మరింత ఆసక్తిని పెంచుకుంది. ఈ ట్రైలర్ మేకింగ్ చూస్తే...ఏదో పెద్ద హీరో చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ట్రైలర్ గా ఉంది కానీ ఓటిటిలో వచ్చే సీరిస్ లా లేదనిపిస్తుంది. మీరు ఓ లుక్కేయండి.

YouTube video player


ఇక ఈ వెబ్ సిరీస్‌కు యంగ్ డైరక్టర్ పవన్ సాదినేని (Pawan Sadineni) దర్శకుడు. తను ఇదివరకు ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ టైటిల్‌కు ‘ఫీల్ ద రేజ్’ అనేది ట్యాగ్‌లైన్. అంతేకాదు ఈ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో (Disney+Hotstar) స్ట్రీమింగ్ కానుంది.

‘దయ’ వెబ్ సిరీస్‌లో ఈషా రెబ్బా (Eesha Rebba), రమ్య నంబేసన్, కమల్ కామరాజు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు ఇందులో జెడీ 2.0ని చూస్తారని ప్రేక్షకులకు హామీ ఇచ్చాడు దర్శకుడు.