సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నితిన్ మరణ వార్త విని షాక్ కు గురైన జయసుధ మెల్లెగా ఆ షాక్ నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

నిజానికి ఫిబ్రవరి 17న జయసుధ దంపతుల పెళ్లి రోజు. ఆయనతో గత స్తృతుల్ని నెమరు వేసుకున్న జయసుధ కన్నీరు మున్నీరైనా... ఇకపై ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుందాం. ఆమె పెళ్లి రోజున దతన భర్త నితిన్ ను గుర్తు చేసుకుంటూ.. తనకు నితిన్ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని.. ప్రియమైన శ్రీవారు ఆ భగవంతుని వద్ద శాంతియుతంగా ఉన్నారని... నేటికి తమ వివాహమై 32 ఏళ్లయిందని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

 

జయసుధ కష్ట కాలంలో మీడియా కూడా నితిన్ మరణంపై అతిగా ప్రవర్తించకుండా డిగ్నిటీతో వ్యవహరించింది. ఆమె త్వరగా మామూలు స్థితికి చేరుకుని మళ్లీ జయ సుధగానే ఉండాలని కోరుకుందాం.