కొన్ని కాన్సెప్టు లు వినగానే నవ్వు వస్తాయి.  మరికొన్ని వాటిని ఫన్నీ వేలో  ప్రెజెంట్ చేసినప్పుడు నవ్వు వస్తాయి. ఓ సీరియస్ మెడికల్ కండీషన్ ని బేస్ చేసుకుని ఫుల్ లెంగ్త్ ఫన్ తో రన్ చేయటం అంత ఈజీకాదు. కానీ ఆ పని చేసింది తమిళ చిత్రం  ‘కోమలి’. అయితే నవ్వటం కోసం చేసిన ఈ ప్రయత్నంలో  ఓ సెటైర్ సూటిగా వెళ్లి రజనీకాంత్ కు తగిలింది. దాంతో  ఆయన  ఫ్యాన్స్  రచ్చ రచ్చ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. జయం రవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రదీప్ రంగనాధన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కోమలి’. ఈ సినిమా ట్రైలర్‌ను  విడుదల చేసింది చిత్ర యూనిట్. దాదాపు 2.15 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యంతం ఆకట్టుకుంటోంది.

పదహారేళ్ళ క్రితం కోమాలోకి వెళ్లిన హీరో.. అధునాతన కాలంలో కళ్ళు తెరుస్తాడు. ఆ లైఫ్‌ను హీరో ఎలా జీవించాడు.. ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటనేది చిత్ర కథాంశం. ట్రైలర్ అంతటా ఉన్న కామెడీ సీన్స్ అభిమానులను అద్భుతంగా అలరిస్తున్నాయి. అయితే అదే సమయంలో ఈ ట్రైలర్ చివర్లో రజనీకాంత్ పై సెటైర్ వేసాడు. క్రేజ్ కోసం చేసిన ఆ పని ఇప్పుడు సినిమాని బాయ్ కాట్ చేయమనేంత దూరం వెళ్లింది. 

నవ్వు కోమాలో  16 ఏళ్లు ఉన్నావని చెప్తూ... హీరో ఫ్రెండు టీవీ పెట్టి సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటిస్తున్న వీడియో చూపిస్తాడు. కావాలంటే చూడు ఇది 2016 అంటాడు. హీరో ఆ వీడియో చూసి నన్ను ఏమార్చకండి.. రజనీ రాజకీయారంగేట్రం చేస్తానని అంటున్నాడంటే ఇది 1996 అంటాడు. అంటే ఇండైరక్ట్ గా రజనీ 20 ఏళ్ల ముందు నుంచే రాజకీయారంగేట్రం గురించి  మాట్లాడుతూన  ఉన్నాడంటూ సెటైర్ వేసిందన్నమాట చిత్ర  యూనిట్. దాంతో రజనీ ఫ్యాన్స్ ...సోషల్ మీడియాలో ..‘బాయ్‌కాట్ కోమలి’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి జయం రవి అండ్ టీం పై దాడి చేస్తున్నారు. 

ఇక ట్రైలర్ లో ..హిప్ హాప్ బ్యా‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆడియన్స్‌కు ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఖాయమని అనిపిస్తోంది. ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది.