ప్రముఖ సీనియర్‌ నటి, దర్శకురాలు, నిర్మాత జయచిత్ర భర్త గణేష్‌(62) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం తిరుచ్చిలోని ఆయన గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. దీంతో జయచిత్ర ఇంట విషాదం నెలకొంది. 

ప్రముఖ సీనియర్‌ నటి, దర్శకురాలు, నిర్మాత జయచిత్ర భర్త గణేష్‌(62) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం తిరుచ్చిలోని ఆయన గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. దీంతో జయచిత్ర ఇంట విషాదం నెలకొంది. తెలుగు తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మేటి నటిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్న జయచిత్ర తమిళనాడులోని కుంభకోణంకు చెందిన గణేష్‌తో 1983లో వివాహం జరిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గణేష్‌ ఓ చిత్రం నటుడిగానూ కనిపించారు. జయచిత్ర గణేష్‌లకు కుమారుడు అమ్రేష్‌ ఉన్నారు. ఆయన సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో దాదాపు రెండు వందలకుపైగా చిత్రాల్లో నటించిన జయచిత్ర అగ్ర నటిగా ఎదిగారు. ఆమె తెలుగులో `సోగ్గాడు`, `మా దైవం`, `ఆత్మీయుడు`, `కటకటాల రుద్రయ్య`, `బొబ్బిలి పులి`, `ఘరానా బుల్లోడు`, `సమరసింహారెడ్డి` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. 

 గణేశ్‌ శుక్రవారం ఉదయం తిరుచ్చిలో కన్నుమూయగా ఆయన భౌతికకాయాన్ని చెన్నై, పోయెస్‌ గార్డెన్‌లోని స్వగృహానికి తరలించారు. గణేశ్‌ పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. నేడు(శనివారం) గణేష్‌ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.