Asianet News TeluguAsianet News Telugu

ఒకేరోజు రిలీజ్, ఒకటే ఓటీటీలో స్ట్రీమింగ్..? జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీస్ ఓటీటీ డిటేయిల్స్

ఈరోజు(సెప్టెంబర్7) రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ ను అలరించాయి. టాలీవుడ్ నుంచి అనుష్క, బాలీవుడ్ నుంచి షారుఖ్ థియేటర్లలో సందడి చేయగా.. టాలీవుడ్ నుంచి అనుష్క అదరగొట్టింది. ఒకే  రోజు రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు..ఒకే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. 
 

Jawan Movie and Miss Miss Shetty Mr Polishetty OTT Details JMS
Author
First Published Sep 7, 2023, 9:29 AM IST


బాలీవుడ్ నుంచి సౌత్ వాసనలతో.. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యింది షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా.. ఇటు టాలీవుడ్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ.. క్లాసిక్ కామెడీ మూవీగా ఎంట్రీ ఇచ్చింది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ. ఈరెండు సినిమాలు ఈరోజు( సెప్టెంబర్7) బాక్సాఫీస్ బరిలో నిలవగా.. ఏమాత్రం పోటీ లేకుండా.. రెండు సినిమాలు.. రెండు డిఫరెంట్ జానర్ లో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. పక్కా యాక్షన్ మూవీగా షారుఖ్ ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్ ఇవ్వగా..? ఇటు అనుష్క శెట్టి.. నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ మూవీ మాత్రం కామెడీ, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది. ఇక ఈక్రమంలో ఈరెండు సినిమాలు ఓటీటీ రిలీజ్ పై తాజాగా ఓ అప్ డేట్ వైరల్ అవుతోంది. 

జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో పాటు.. ఒకే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈరెండు సినిమాల హక్కులను పోటీ పడి మరీ.. నెట్ ప్లిక్స్ దక్కించుకుందట. ముఖ్యంగా ఈ రెండు సినిమాల కోసం పెద్ద పెద్ద డిజిటల్ ప్లాట్ ఫార్మస్ పోటీ పడ్డట్టు సమాచారం. అందులో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ కోసం 300 నుంచి 400 కోట్ల వరకూ డిమాండ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఫైనల్ గా ఈమూవీని నెట్ ప్లిక్స్ సొంతం చేసుకుంది అంటూ బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. 

షారుఖ్ ఖాన్ హీరోగా.. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో .. తెరకెక్కిన జవాన్ మూవీలో.. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార షారుఖ్ జోడీగా నటించింది. ఇక అనిరుధ్ రవిచంద్ర మ్యూజిక్ అందించిన ఈసినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. ఈరోజు రిలీజ్ అయిన ఈమూవీ యాక్షన్ లవర్స్ కు.. షారుఖ్ అభిమానులకు ఫుల్ మీల్స్ లా దొరికిందంటూ సంబరపడిపోతున్నారు. 

అటు  మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో కూడా గట్టి పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. ఈమూవీ కోసం అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ , నెట్ ప్లిక్స్ లు గట్టి పోటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. చివరకు ఈ సినిమా కూడా నెట్ ప్లిక్స్ లో రిలీజ్ కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నెట్ ప్లిక్స్ తో పాటు.. ఈమూవీ అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.  

అనుష్క దాదాపు 5 ఏళ్ళ విరామం తరువాత ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఇప్పటికే ప్రిమియర్స్ టాక్ పాజిటీవ్ గా వనిపిస్తుంది. స్వీటీ నటన అద్భుతమని.. ఏమాత్రం ప్రభావం తగ్గకుండా పెర్ఫామెన్స్ తో అదరగోట్టిందంటూ ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. మరి ఈమూవీ కలెక్షన్లు.. స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇక మరో విషయం ఏంటీ అంటే జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నవంబర్ లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios