సలార్, జవాన్ చిత్రాలు రోజుల వ్యవధిలో విడుదల కానుండగా భారీ బాక్సాఫీస్ వార్ కి రంగం సిద్ధం అవుతుందంటున్నారు.
రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వార్ కి సిద్ధం అవుతున్నాయి. ప్రభాస్-షారుక్ ఖాన్ నువ్వా నేనా అని తేల్చుకోనున్నారు. రోజుల వ్యవధిలో సలార్, జవాన్ విడుదల కానున్నాయి. షారుక్ ఖాన్ పఠాన్ తో ఫార్మ్ లోకి వచ్చాడు. వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో పఠాన్ వెయ్యి పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. షారుక్ నెక్స్ట్ మూవీ జవాన్. సౌత్ ఇండియా టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ జవాన్ తెరకెక్కించడం మరొక విశేషం.
జవాన్ మూవీలో నయనతార హీరోయిన్. ప్రియమణి కీలక రోల్ చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న లేదా 9న విడుదల చేయనున్నారట. ఇక జవాన్ విడుదలైన మూడు వారాలకు సలార్ బరిలో దిగనుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. కెజిఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ చేస్తున్న మూవీ కావడంతో విపరీతమైన హైప్ నెలకొంది. జులై 6న విడుదల కానున్న టీజర్ అన్ని చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు.
కాగా సెప్టెంబర్ నెలలో జవాన్, సలార్ రోజుల వ్యవధిలో విడుదల కానున్నాయి. రెండు చిత్రాల మీద అంచనాలు ఉన్నాయి. ఇద్దరూ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్ గా ఉన్నారు. కాబట్టి ఈ రెండు చిత్రాల మధ్య పోటీ నెలకొంటుంది. ముఖ్యంగా హిందీ బాక్సాఫీజు వద్ద టాప్ కాంపిటీషన్ చూడవచ్చు. రెండు చిత్రాల విడుదల మధ్య వ్యవధి ఉన్నప్పటికీ... నార్త్ లో చిత్రాలకు లాంగ్ రన్ ఉంటుంది. ఆదరణ దక్కించుకున్న చిత్రాలు రెండు మూడు నెలలు నిరవధికంగా ఆడతాయి.
పుష్ప మూవీ అక్కడ వారాల తరబడి ఆడింది. కాబట్టి జవాన్ హిట్ టాక్ తెచ్చుకుంటే మూడు వారాల తర్వాత విడుదలయ్యే సలార్ తో పోటీపడుతుంది. కాబట్టి ఇద్దరు బాక్సాఫీస్ కింగ్స్ మధ్య ఉత్కంఠ పోరు చూడొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
