‘జాతిరత్నాలు’ హీరోయిన్..మంచు హీరోని ఓకే చేసిందా?
చిట్టిగా తెరపై దుమ్ము రేపిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాత్రం రేసులో వెనకబడింది. పలువురు స్టార్ హీరోల సినిమాల విషయంలో ఆమె పేరు వినిపించింది. కానీ ఆమె రెండో చిత్రం ఖరారు కాలేదు. తాజాగా ఆమె ఓ సినిమాకు సైన్ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఫుల్ లెంగ్త్ ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాగా రూపొందిన జాతి రత్నాలు టీమ్ కు, అందులో నటించిన ఆర్టిస్ట్ లకు,హీరో,హీరోయిన్స్ కు అందరికీ వరస ఆఫర్స్ వచ్చి పడతాయని అందరూ భావించారు. ఇప్పటికే సినిమాలో హీరోగా నటించిన నవీన్ పొలిశెట్టి మస్త్ బిజీ అయ్యారు. ఇక హీరోకు సైడ్ కిక్స్ గా చేసిన కమెడియన్స్ ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ లు కూడా ప్రస్తుతం మోస్ట్ బిజీ కమెడియన్స్ గా టర్న్ అయ్యిపోయారు. అయితే చిట్టిగా తెరపై దుమ్ము రేపిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాత్రం రేసులో వెనకబడింది. పలువురు స్టార్ హీరోల సినిమాల విషయంలో ఆమె పేరు వినిపించింది. కానీ ఆమె రెండో చిత్రం ఖరారు కాలేదు. తాజాగా ఆమె మంచు విష్ణు సరసన ఢీ సీక్వెల్ సినిమాకు సైన్ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా రవితేజ సినిమాలో ఆమె ఎంపికైనట్లు చెప్పుకున్నారు. తాజా వార్తల్లో నిజమెంత
వివరాల్లోకి వెళితే...ఫరియా అబ్దుల్లా..మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న డీ అండ్ డీ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. మంచు విష్ణు - శ్రీను వైట్ల కలయికలో మరో సినిమాకి రంగం సిద్ధమైంది. ‘ఢీ’ తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈసారి కూడా ‘ఢీ’ని గుర్తు చేస్తూ ‘డి అండ్ డి’ పేరుతో సినిమా చేస్తున్నారు. డబుల్ డోస్... అనేది ఉపశీర్షిక. స్క్రిప్టు ఇప్పటికే సిద్ధమైంది. ఇందులో కథానాయికగా ‘జాతిరత్నాలు’ హీరోయిన్ ఫరియా అబ్దుల్లాని ఎంపిక చేసేందుకు చిత్ర టీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. ఫరియా తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అప్పట్నుంచి ఆమెకి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కాకపోతే ఖరారు కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో మరి విష్ణుతో జోడీ కడుతుందా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
ఇక ‘ఢీ’.. మంచు విష్ణు-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం. విష్ణు, జెనీలియా, శ్రీహరి నటనతోపాటు బ్రహ్మానందం, సునీల్ కామెడీ టైమింగ్ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2007లో వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. త్వరలో ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్ రాబోతోందని అఫీషియల్ గా ప్రకటించారు. ‘‘కొన్ని వేలమంది సినీప్రియుల అభిమాన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క నటీనటుడికి ఇది ఒక గేమ్‌ఛేంజర్. ఆ రోజుల్లో సినిమాకి సంబంధించిన ఓ సరికొత్త ఒరవడికి ‘ఢీ’ శ్రీకారం చుట్టింది. ‘ఢీ’ కంటే బెటర్ ఏమి ఉంటుంది?’’ అని విష్ణు పేర్కొన్నారు.