Asianet News TeluguAsianet News Telugu

Venkatesh: విక్టరీ వెంకటేష్ తో జాతిరత్నం.. కామెడీ పీక్స్ కి చేరినట్లే ?

విక్టరీ వెంకటేష్ దృశ్యం లాంటి విభిన్నమైన చిత్రాలు చేస్తూ.. ఎఫ్3 లాంటి వినోదాత్మక చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎఫ్3 చిత్రం మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.

jathi Ratnalu fame anudeep to direct Venkatesh
Author
Hyderabad, First Published Jun 29, 2022, 2:14 PM IST

విక్టరీ వెంకటేష్ దృశ్యం లాంటి విభిన్నమైన చిత్రాలు చేస్తూ.. ఎఫ్3 లాంటి వినోదాత్మక చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎఫ్3 చిత్రం మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. టాక్ బావున్నా జనాలు థియేటర్స్ కి రావడం లేదు. కొన్ని చిత్రాల కోసమే ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తున్నారు. 

ఇది పక్కన పెడితే వెంకటేష్ తదుపరి చిత్రం ఏంటి ? ఏ దర్శకుడితో వెంకీ మామ సినిమా చేయబోతున్నాడు ? అనే సస్పెన్స్ ఇంకా వీడలేదు. వెంకటేష్ నెక్స్ట్ మూవీ ఫైనల్ కాలేదు. వెంకటేష్ ప్రస్తుతం రానాతో కలసి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ ‘కభీ ఈద్ కభీ దీవాలి’ చిత్రంలో కామియో రోల్ పోషిస్తున్నాడు. 

అంతేకానీ వెంకీ సోలో హీరోగా నటించే చిత్రం ఇంకా ఫైనల్ కాలేదు. అయితే తాజాగా సమాచారం మేరకు వెంకీ నెక్స్ట్ మూవీకి తొలి అడుగు పడ్డట్లు తెలుస్తోంది. జాతి రత్నాలు దర్శకుడు  అనుదీప్ తో వెంకటేష్ తదుపరి చిత్రానికి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

జాతిరత్నాలు చిత్రాన్ని అనుదీప్ కామెడీతోనే బ్లాక్ బస్టర్ గా మలిచారు. వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి చెప్పేదేముంది. వీరిద్దరూ చేతులు కలిపితే ఆడియన్స్ పొట్ట చెక్కలు కావడం ఖాయం. ప్రస్తుతం అనుదీప్ తమిళ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే వెంకటేష్ మూవీ గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios