#Devara:లాస్ట్ మినిట్ లో జాహ్నవి కపూర్ షూట్ కాన్సిల్?
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'దేవర' సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ #NTR, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’.RRR తర్వాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ మళ్లీ షూటింగ్ చేస్తోన్న సినిమా ఈ ‘దేవర’. కొరటాలపై నమ్మకంతో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా రోజులు పాటు వెయిట్ చేశారు. కథ,స్క్రీన్ ప్లే బాగా కుదిరే వరకు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, తొందర పెట్టినా ఆయన కూల్‌గా ఉంటూ వచ్చారు. ఆర్ ఆర్ ఆర్ తో తనకు పెరిగిన ఇమేజ్ దృష్ట్యా మంచి స్క్రిప్ట్‌తోనే ఆడియెన్స్‌ను ఆయన అలరించాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే కొరటాల శివ కథ నచ్చడంతో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిపోయారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ చిత్రం ఫైట్ సీక్వెన్స్ లు షూట్ చేస్తున్నారు. అయితే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సీన్స్ షూట్ పూర్తి కాలేదట. ఆ ఫైట్ సీక్వెన్స్ పనిలోనే టీమ్ తల మునకలుగా బిజీగా ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం జాహ్నవి కపూర్ #JanhviKapoor ఈ షెడ్యూల్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ గ్యాప్ లేకపోవటంతో లాస్ట్ మినిట్ లో ఆమెను రిక్వెస్ట్ చేసి ఆమె షూట్ ని రీషెడ్యూల్ చేసినట్లు సమాచారం. అక్టోబర్ మూడవ వారంలో జాహ్నవి ,ఎన్టీఆర్ కాంబో సీన్స్ షూట్ ఉంటుందని సమాచారం.
ఇక ఈ చిత్రానికి అనిరుద్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. వీరితో పాటు హాలీవుడ్ టెక్నిషియన్స్ సైతం యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేస్తున్నారు.అలాగే ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. అందులో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే తండ్రి పేరే ‘దేవర’ అని టాక్. తారక్ పవర్ కు తగ్గట్టుగా ఆయన పాత్ర ఉంటుందని ఫస్ట్ లుక్ చూడగానే అర్థమవుతోంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు.