అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ క్రేజీ స్టార్ గా మారింది. గ్లామర్ షోలో జాన్వీ కపూర్ ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది.
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ క్రేజీ స్టార్ గా మారింది. గ్లామర్ షోలో జాన్వీ కపూర్ ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రంలో జాన్వీ హీరోయిన్ గా ఎంపికైంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ షురూ అయింది.
సినిమాలని పక్కన పెడితే జాన్వీ కపూర్ కి భక్తి కూడా ఎక్కువే. తరచుగా జాన్వీ కపూర్ వివిధ ఆలయాలని సందర్శించడం చూస్తూనే ఉన్నాం. ఇక శ్రీవారి సన్నిధి అయిన తిరుమలకి జాన్వీ కపూర్ 6 నెలలకు ఒకసారి అయినా వస్తూ ఉంటుంది. కొన్ని నెలల క్రితం కాలినడకన తిరుమలకు వచ్చిన జాన్వీ.. శ్రీవారిని దర్శించుకుని వెళ్ళింది.
ఇప్పుడు మరోసారి జాన్వీ కపూర్ తిరుమలని సందర్శించింది. అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియా తో కలసి తిరుమలకి వెళ్లడం విశేషం. సోమవారం ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో జాన్వీ కపూర్, శిఖర్ శ్రీవారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలకగా.. అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు.
జాన్వీ కపూర్ శ్రీవారి ఆలయం ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఎంతో భక్తి శ్రద్దలతో జాన్వీ కపూర్ తిరుమలలో కనిపించింది. సాంప్రదాయ బద్దంగా లంగా ఓణీలో లో మెరిసింది. ఇక ఆమె ప్రియుడు శిఖర్ పంచె కట్టు, కండువాలో కనిపించాడు. శిఖర్, జాన్వీ కపూర్ ఇద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పలు ఈవెంట్ లో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని కనిపించారు. బోనీ కపూర్ నుంచి కూడా వీరిద్దరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. శ్రీదేవికి కూడా తిరుమల శ్రీవారు అంటే సెంటిమెంట్. ఆమె కూడా తరచుగా తిరుమలని విజిట్ చేసేది. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా తల్లి బాటలోనే పయనిస్తోంది.
