Asianet News TeluguAsianet News Telugu

నయనతార చేసిన పాత్రలో జాన్వీ కపూర్

తమిళంలో  విడుదలైన ‘కోలమావు కోకిల’ సెన్సేషనల్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌తో పాటు బాలీవుడ్‌ దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఇప్పుడీ సినిమాని జాన్వీ కపూర్ తో చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతన్నాయని తెలుస్తోంది.  

Janhvi Kapoor to reprise Nayantharas role
Author
Hyderabad, First Published Oct 1, 2020, 12:55 PM IST

నయనతార నటించిన  చిత్రం రీమేక్ లో  జాన్వీ కపూర్‌ కనిపించబోతున్నారా? అంటే అందుకు తగ్గ ప్రయత్నాలు మొదలయ్యాయనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. మాయ, డోర, ఆరమ్, అనామిక.. వంటి లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌తో ‘లేడీ సూపర్‌ స్టార్‌’ అనిపించుకుంది నయనతార. ఆమె తమిళంలో  టైటిల్‌ రోల్‌ చేసిన మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘కోలమావు కోకిల’. ఈ చిత్రం తెలుగులో ‘కో.. కో.. కోకిల’ పేరుతో విడుదల అయ్యింది. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసింది. నెల్సన్‌ దర్శకుడు.

  తమిళంలో  విడుదలైన ‘కోలమావు కోకిల’ సెన్సేషనల్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌తో పాటు బాలీవుడ్‌ దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఇప్పుడీ సినిమాని జాన్వీ కపూర్ తో చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతన్నాయని తెలుస్తోంది.  ప్రముఖ హిందీ దర్శకుడు ఆనంద్.ఎల్ రాయ్ ఈచిత్రం రీమేక్ రైట్స్ తీసుకున్నారు. ఓ సాధారణమైన అమ్మాయి అనుకోకుండా ఒక స్మగ్లింగ్‌ గ్యాంగ్‌ చేతిలో చిక్కుకుపోతుంది. వాళ్ల నుంచి బయటపడటానికి కోకిల చేసిన సాహసం ఏంటి? అనే  పాయింట్‌ను డైరెక్టర్‌ నెల్సన్‌ ఆసక్తికరంగా తెరకెక్కించారు.

అలాగే జాన్వీ కపూర్ మరో రీమేక్ కూడా కమిటైందని సమాచారం. 2019లో మలయాళంలో సూపర్‌హిట్‌ సాధించిన చిత్రం ‘హెలెన్‌’. అన్నాబెన్‌ టైటిల్‌ రోల్‌ చేశారు. ఫారిన్‌ వెళ్లాలనుకునే బీఎస్సీ నర్సింగ్‌ గ్రాడ్యుయేట్‌ ‘హెలెన్‌’ ఇంగ్లీష్‌ ట్రైనింగ్‌ క్లాసులు తీసుకుంటూ ఓ రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తుంటుంది.

కానీ ఓ రోజు ఆ రెస్టారెంట్‌లోని కోల్డ్‌ స్టోరేజ్‌లో ఇరుక్కుపోతుంది హెలెన్‌. అప్పటికే ఆ రెస్టారెంట్‌ మేనేజర్‌ తాళం వేసి వెళ్లిపోతాడు. మైనస్‌ 18 డిగ్రీల చలిలో హెలెన్‌ తనను తాను ఎలా రక్షించుకుంది? అన్నదే ఈ చిత్రం ప్రధానాంశం. హిందీలో ‘హెలెన్‌’ చిత్రం రీమేక్‌ కానుందట. జాన్వీ కపూర్‌ టైటిల్‌ రోల్‌ చేయనున్నారని సమాచారం. మరోవైపు ఈ ‘హెలెన్‌’ చిత్రం తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో కూడా రీమేక్‌ కానుందని తెలిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios