‘జైలర్’డైరక్టర్ తో చిరు ప్లానింగ్? నిర్మాత ఎవరంటే..

'జైలర్' సినిమా సక్సెస్​ను అందుకున్న నెల్సన్‌.. ఇప్పుడు ధనుశ్​తో ఓ సినిమా తీసేందుకు ప్లాన్​ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ లోగా..

Jailer director Nelson to direct Mega Star Chiranjeevi? jsp

సూపర్ స్టార్ రజనీకాంత్  టైమ్ అయ్యిపోలేదని , భాక్సాపీస్ దగ్గర ఆయన స్టామినాను మరోసారి చూపించిన చిత్రం ‘జైలర్’. 72 ఏళ్ల వయసులోనూ రజనీ క్రేజ్‌కు, మార్కెట్‌కు తిరుగులేదని నిరూపించింది ‘జైలర్’. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ.700 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా ‘జైలర్’ నిలిచింది. దాంతో అందరి దృష్టీ ఈ చిత్ర దర్శకుడు నెల్సన్ పై పడింది. ముఖ్యంగా సీనియర్ హీరోలు తమని కూడా నెల్సన్ డైరక్ట్ చేసి జైలర్ లాంటి హిట్ ఇస్తే బాగుండును అనే ఆలోచనలో పడ్డారు. అయితే నెల్సన్ కు యంగ్ హీరోల నుంచి ఆఫర్స్ వస్తుంటే ఇటు సీనియర్స్ వైపు ఎందుకు చూస్తాడు. అయితే తెలుగులో మాత్రం నెల్సన్ ఓ సినిమా చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.

నెల్సన్ తొలి చిత్రం కోక్కోకిల (నయనతార) చిత్రం చూసి నచ్చి, అప్పట్లో సీనియర్ నిర్మాత కే.ఎస్ రామారావు తమ బ్యానర్ లో ఓ సినిమా చేసి పెట్టమని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. జైలర్ రిలీజ్ తర్వాత కంగ్రాట్స్ చెప్పి ఆ విషయం గుర్తు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరో ప్రక్క కె.ఎస్ రామారావుకు మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తానని మాట ఇచ్చారు. మొన్న భోళా శంకర్ నుంచి లాస్ట్ మినిట్ లో కెఎస్ రామారావు తప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం నెల్సన్ డేట్స్ తో చిరంజీవిని కలిసి ఓ సినిమా ప్లాన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఇమ్మీడియట్ గా నెల్సన్ చేస్తాడా లేక అక్కడ తమిళంలో మరో సినిమా చేసి ఇక్కడకు వస్తాడా అనేది తెలియాల్సి ఉంది.    నెల్సన్‌.. ఇప్పుడు ధనుశ్​తో ఓ సినిమా తీసేందుకు ప్లాన్​ చేస్తున్నారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే  చిరంజీవి తో చేయటానికి నెల్సన్ సైతం ఆసక్తిగా ఉన్నాడని చెప్తున్నారు. అదే జరిగితే  ‘జైలర్’లాంటి బ్లాక్ బస్టర్ చిరంజీవికి పడినట్లే .

ఇక హై సక్సెస్  అందుకున్న ‘జైలర్’ మూవీ సెప్టెంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రంలో తమన్నా, జాకీష్రాఫ్‌, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, సునీల్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటించింది. అనిరుధ్ సంగీతం అందించారు. 

2018లో నయనతార లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'కోలమావు కోకిల' అనే సినిమాతో మెగాఫోన్​ పట్టిన నెల్సన్​.. ఆ తర్వాత శివ కార్తికేయన్​తో 'డాక్టర్‌', దళపతి విజయ్​తో 'బీస్ట్‌' సినిమాలను తెరకెక్కించారు. ఆ తర్వాత ఇప్పుడు జైలర్​తో సాలిడ్​ హిట్​ను తన ఖాతాలోకి వేసుకున్నారు. తీసింది నాలుగు సినిమాలే అయినప్పటికీ తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios