Asianet News TeluguAsianet News Telugu

సర్ప్రైజ్ ఇస్తామంటున్న జాన్వీ, అర్జున్!

బ్రదర్ అర్జున్ తో ఉన్న వీడియో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసిన జాన్వీ 'సంథింగ్ ఎక్సైటింగ్' అంటూ కామెంట్ పెట్టారు. అదే వీడియో వీడియో అర్జున్ కపూర్ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేయడంతో పాటు, మేము ఏమి చేయాలనుకుంటున్నామో , ఎవరైనా ఊహించగలరా అంటూ కామెంట్ పెట్టారు. 
 

jahnvi kapoor and arjun kapoor hints there is a big surprise ksr
Author
Hyderabad, First Published Jul 2, 2021, 12:21 PM IST

బాలీవుడ్ క్రేజీ కజిన్స్ అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ బ్రదర్ అండ్ సిస్టర్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఫ్యాన్స్ కి చిన్న ఫజిల్ వదిలారు. బ్రదర్ అర్జున్ తో ఉన్న వీడియో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసిన జాన్వీ 'సంథింగ్ ఎక్సైటింగ్' అంటూ కామెంట్ పెట్టారు. అదే వీడియో వీడియో అర్జున్ కపూర్ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేయడంతో పాటు, మేము ఏమి చేయాలనుకుంటున్నామో , ఎవరైనా ఊహించగలరా అంటూ కామెంట్ పెట్టారు. 


ఈ స్టార్ బ్రదర్, సిస్టర్ సోషల్ మీడియా పోస్ట్స్ నేపథ్యంలో ఫ్యాన్స్ ఎవరికి వచ్చిన ఊహాగానాలలో వాళ్ళు తేలియాడుతున్న. ఎక్కువ మంది నెటిజెన్స్ త్వరలో ఇద్దరు కలిసి చేయనున్న కొత్త మూవీ ప్రాజెక్ట్ ప్రకటన ఉంటుందని, దాని గురించే వీరి హంగామా అంటున్నారు. విషయం ఏదైనా తాము చేయబోయే ప్రాజెక్ట్ కి మంచి ప్రాచుర్యం రాబట్టారు. 


మరి జాన్వీ ,అర్జున్ చేయనున్న ప్రాజెక్ట్ ఏమిటో తెలియాలనే కొంచెం వెయిట్ చేయాల్సిందే. మరోవైపు జాన్వీ దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ చిత్రాలలో నటిస్తున్నారు. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో రూహి విడుదల కావడం జరిగింది. హారర్ కామెడీ జోనర్ లో విడుదలైన రూహి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios