టాలీవుడ్ సీనియర్‌ యాక్టర్..మాజీ హీరో జగపతిబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను తాను తిట్టుకుంటూ.. తనకు సిగ్గులేదు అంటూనే.. ఓ పోస్ట్ ను వదిలారు జగ్గుబాయి. ఇంతకీ ఆయన అలా అనడానికి కారణం ఏంటి..? 

హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా మారిపోయిన జగపతి బాబు.. అప్పటికంటే కూడా ఇప్పుడే ఎక్కువగా బిజీ అయిపోయారు. వరుస సినిమాలలో దడదడలాడిస్తున్నారు. తెలుగుతో పాటు.. తమిళసినిమాలు కూడా చేస్తూ.. అక్కడ కూడా పాపులర్ అయ్యాడు జగపతి. అయితే ఆయన ఏ పనిచేసినా డిఫరెంట్ గా ఉంటుంది. సోసల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండే ఈ ప్యామిలీ హీరో.. చాలా చమత్కారంగా పోస్ట్ లు పెడుతూ.. సందడి చేస్తుంటాడు

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

All So Read : అమ్మ శ్రీదేవి చివరి కోరిక తీర్చుతున్న జాన్వీ కపూర్.. అతిలోక సుందరి చివరి కోరిక ఏంటంటే..?

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా జగపతిబాబుకు మంచి పేరుంది. ఆతరువాత విలన్ గా మారిన ఆయన గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌సరం లేదు. తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులను ఫాలోవర్లను సంపాదించుకున్నాడు జగపతి బాబు. మల్టీ టాలెంటెడ్‌ యాక్టర్‌ గా పేరు సంపాదించుకున్న జగపతి బాబును.. విలన్ గా మారిన తరువాత జగ్గూభాయ్‌ అని పిలవడం స్టార్ట్ చేశారు జనాలు. 

All So Read : భార్యను వదిలేద్దామనుకున్నా పూరీ జగన్నాథ్.. లావణ్య గురించి ఆ నిజం తెలియడంతో షాక్ అయ్యాడట.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే జగపతి బాబు.. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్‌తో అందరినీ పలుకరిస్తుంటాడు. అంతే కాదు తన పోస్ట్ లలో కాస్త వెరైటీ స్టఫ్ కూడా ఉండేలా చూసుకుంటాడు స్టార్ నటుడు ఇక ఇప్పుడు తాజాగా ఓ పోస్టు పెట్టి మరోసారి వార్త‌ల్లో నిలిచాడు.తాజాగా ఓ క్యాసినోకి వెళ్లిన జగపతిబాబు అక్క‌డ దిగిన ఫొటోను సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు. దానికి ఆయన ఇచ్చిన క్యాప్షన్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

All So Read ; మహేష్ బాబు ఏంటి ఇలా చేశాడు.. సూపర్ స్టార్ పై అలిగిన రాజమౌళి..? ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదా... ?

ఈ పోస్ట్‌కు.. నాకు సిగ్గు శ‌రం లేద‌ని దిగులు ప‌డ‌ను.. కానీ మీరు చెబితే ప‌డ‌తాను అంటూ ఈ పోస్ట్ కింద రాసుకోచ్చాడు. ఈ ఫొటో చూస్తుంటే జగపతి బాబు క్యాసినోలో పోక‌ర్ గేమ్ ఆడిన‌ట్లు తెలుస్తుంది. అందుకే ఇలా డిఫరెంట్ కామెంట్ తో పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్ట్ కు తగ్గట్టే.. రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఎవరికితోచిన కామెంట్ వారు పెడుతున్నారు. 

Scroll to load tweet…

ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. గ‌తేడాది స‌లార్‌తో పాటు రుద్రంగి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు జగపతిబాబు.. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ ను సాధించాయి. ఇక వరుసగా జగ్గుబాయికి అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన సలార్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరికొన్నిప్రాజెక్ట్స్ పెడ్డింగ్ లో ఉన్నాయి. అటు తమిళంలో కూడా జగపతిబాబు బిజీ అయ్యారు.