సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా నుంచి సీనియర్ యాక్టర్ జగపతి బాబు డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ సరిలేరు నీకెవ్వరూ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో ఒక కీలక పాత్ర కోసం జగపతి బాబును సస్క్రిప్ట్ రెడీ అవుతున్న సమయంలోనే దర్శకుడు సెలెక్ట్ చేసుకున్నాడు. 

రీసెంట్ గా సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ తరుణంలో జగపతి బాబు సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. ఇక అనిల్ రావిపూడి నిర్మాతలతో చర్చించి ఆయన ప్లేస్ లో ప్రకాష్ రాజ్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. జగపతి బాబు అసలు సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. 

ఇక సినిమాను అనిల్ సుంకరతో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు రాజేంద్ర ప్రసాద్ - మహేష్ కి సంబందించి సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.  ఈ షెడ్యూల్ అనంతరం విజయశాంతి కూడా చిత్ర యూనిట్ తో కలవనున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.