హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న జగపతి బాబు.. ఫ్యాన్స్ ని సలహా అడుగుతూ..
సీనియర్ నటుడు జగపతి బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ పాత్రలు చేస్తూ రాణిస్తున్నారు. విలక్షణమైన విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ రాణిస్తున్నారు.

సీనియర్ నటుడు జగపతి బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ పాత్రలు చేస్తూ రాణిస్తున్నారు. విలక్షణమైన విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ రాణిస్తున్నారు. రంగస్థలం, అరవింద సమేత లాంటి చిత్రాల్లో జగపతి బాబు విలనిజం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్ గా అభిమానులని సొంతం చేసుకున్న జగపతి బాబు ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. ఫ్యాన్స్ జగపతి బాబుని జగ్గూ భాయ్ అంటూ ముద్దుగా పిలిస్తున్నారు. హిందీ, మలయాళం, తమిళ చిత్రాల్లో సైతం జగపతి బాబు నటించారు.
అయితే జగ్గూ భాయ్ కి ఏకంగా హాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నాయట. ఈ విషయాన్ని జగపతి బాబు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కిరాక్ ట్వీట్ తో ఫ్యాన్స్ సలహా అడిగారు. నన్ను హాలీవుడ్ పిలుస్తోంది.. ఏమంటారు అని పోస్ట్ చేశాడు.
జగ్గూ భాయ్ హాలీవుడ్ ఎంట్రీనా అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ ఎంట్రీకి మీరు అర్హులు వెళ్ళండి అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హాలీవుడ్ ని దున్నేసి వచ్చేయండి అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మిమ్మల్ని హాలీవుడ్ వాళ్ళు భరించగలరా అని కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే జగపతి బాబుకు ఆఫర్ వచ్చిన హాలీవుడ్ చిత్రాలు ఏంటి ఆ వివరాలు ఇంకా ప్రకటించలేదు.