దర్శకురాలిగా నటిగా చెరగని ముద్ర వేసిన విజయనిర్మల హఠాన్మరణం ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది. కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు విజయనిర్మల నివాసానికి చేరుకుంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం విజయ నిర్మల భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కృష్ణను ప్రత్యేకంగా కలుసుకొని పరామర్శించారు. జగన్ తో పాటు వైసిపి ఎంపీ విజయసాయి కూడా విజయనిర్మల నివాళులర్పించారు. 

బుధవారం రాత్రి కన్నుమూసిన విజయనిర్మల అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. నేడు మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్ధం ఫిల్మ్ ఛాంబర్ లో ఆమె పార్థివదేహాన్ని ఉంచనున్నారు.