ప్రేమ బందాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు జబర్థస్త్ రాకేష్.. జోర్థార్ సుజాత. వీరి పెళ్ళి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.  

జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ .. న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన జోర్థార్ సుజాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తను ప్రేమించిన సుజాత మెడలో మూడు ముళ్లు వేసి... ఏడడుగులు నడిచాడు రాకేష్. ఇద్దరు బుల్లితెర తారల కుటుంబసభ్యుల తో పాటు జబర్దస్త్ టీమ్ కమెడియన్స్ వారి ఫ్యామిలీస్ మధ్య రాకేష్, సుజాతల పెళ్ళి వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. బుల్లితెర తారలు నూతన వధూవరులకు అందరూ ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. వారి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ పెళ్ళి వేడుకలో యాంకర్ రవి, గెటప్ శ్రీను.. ఫ్యామిలీతో పాటు హాజరయ్యారు. దాదాపు 20 ఏళ్ళక్రితం హైదరాబాద్ వచ్చి మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేశాడు రాకేష్. జబర్థస్త్ లో గత పదేళ్ళు గా స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. అటు సుజాత కూడా జోర్ధార్ వార్తలతో బాగా ఫేమస్ అయ్యింది. రాకేష్.. ధనరాజ్ టీమ్ లీడర్ గా ఉన్న టైమ్ లో రాకేశ్ అతని టీమ్ లో ఓ సభ్యుడిగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొన్నాళ్లకు కిరాక్ ఆర్పీ-రాకింగ్ రాకేష్ పేరుతో టీమ్ లీడర్ కూడా అయ్యాడు. ఆర్పీ వెళ్లిపోవడంతో సింగిల్ టీమ్ లీడర్ గా మారిపోయాడు. 

కాగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారు అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ.. ఇటీవల పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ ప్రకటించారు ఈ జంట. సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తమ ప్రేమని ప్రేక్షకులకు తెలియజేస్తూ, పెద్దల అంగీకారంతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ తెలియజేసింది.

View post on Instagram

ఇక సుజాత న్యూస్ రీడర్ గా ఫేమస్ అవ్వడంతో పాటు.. బిగ్ బాస్ లో కూడా అవకాశం సాధించి మరింత ఇమేజ్ సాధించుకుంది. వీరిద్దరి పరిచయం ప్రేమ తరువాత రాకేశ్ టీమ్ లోనే కంటెస్టెంట్ గా కొనసాగుతోంది. రాకేష్ తో ఈమెకు ముందు నుంచి పరిచయం ఉంది. అయితే ఆమె కూడా జబర్దస్త్ షోలో అడుగుపెట్టడం, రాకేష్ టీమ్ లోనే స్కిట్స్ చేస్తూ వచ్చింది. ఇక రాకేష్ సుజాతతో కలిసి చాలా సార్లు జబర్ధస్త్ స్టేజ్ మీద చాలా సార్లు వీరి ప్రేమ వ్యావహారం బయట పెట్టారు. ఈక్రమంలోనే ఆమధ్య ఏంగేజ్ మెంట్ చేసుకున్న ఈజంట.. ప్రస్తుతం పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. 

తిరుమల తిరుపతి దేవస్థానంలో వీరి వివాహం జరిగింది. ఈ మ్యారేజ్ కి ఇరు కుటుంబ సభ్యులతో పాటు యాంకర్ రవి, గెటప్ శీను, ఏపీ మినిస్టర్ రోజా కుటుంబంతో కలిసి హాజరయ్యి న్యూ కపుల్ ని అశ్విరదించారు. ఇక ఈ పెళ్లి ఫోటోలను రోజా షేర్ చేస్తూ.. నాకు అత్యంత ఆప్తులు నన్ను అమ్మా అని పిలిచే రాకేష్ మరియు సుజాత పెళ్లి బంధంతో ఒకటవుతున్నారు. ఈ జంట నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో వర్ధిల్లుగాక అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది రోజా.