జబర్ధస్త్ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో మహేష్ ఒకరు. తన మార్కు టైమింగ్ పంచ్ లతో జబర్ధస్త్ షోలో నవ్వులు పూయించిన మహేష్, టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకోవడం జరిగింది. మహానటి, రంగస్థలం, గుణ 369 వంటి హిట్ చిత్రాలలో మహేష్ ప్రాధాన్యం ఉన్న రోల్స్ చేయడం విశేషం. 

కాగా ఈ కమెడియన్ మే నెలలో వివాహం చేసుకోవం జరిగింది. కరోనా నిబంధనల నేపథ్యంలో అత్యంత సన్నహితులు బంధువుల మధ్య ఈస్ట్ గోదావరి జిల్లా శివకోడు గ్రామంలో బంధువుల అమ్మాయి పావని మెడలో తాళికట్టాడు. కాగా బుల్లితెర టాప్ గేమ్ షోలలో ఒకటైన క్యాష్ ప్రోగ్రాం కి గెస్ట్ గా మహేష్ హాజరు కావడం జరిగింది. వైవా హర్ష, జోష్ రవి, సుదర్శన్ కూడా ఈ ఎపిసోడ్ లో గెస్ట్స్ గా పాల్గొనడం జరిగింది. 

కంటెస్టెంట్స్ చేత చింతపండు రసం తాగించిన యాంకర్ సుమ, తన మార్కు పంచ్ లతో షోని హోరెత్తించారు. ముఖ్యంగా వైవా హర్ష, మహేష్ పై సుమ విసిరిన సెటైర్స్ బాగా పేలాయి. సుమ బాస్కెట్ బాల్ లీగ్ లో భాగంగా మహేష్ ని ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు. ఈ రెండు విషయాలలో నేను తప్పు చేశానని మీరు భావించిన సందర్భం... ఒకటి కమెడియన్ కావడం, రెండు పెళ్లి చేసుకోవడం అని అడిగారు. 

సుమ అడిగిన ఫన్నీ ప్రశ్నకు మహేష్ తడుముకోకుండా, పెళ్లి చేసుకోవడం అని చెప్పి షాక్ ఇచ్చారు. ఇక ఫోన్ లో మహేష్ భార్యకు ఫోన్ చేసి సుమ మీ ఆయన గురించి చెప్పమనగా, ప్రపంచంలోనే ఉత్తమ భర్త అని చెప్పారు. అనేక ఆసక్తికర విషయాలు సిద్ధం క్యాష్ లేటెస్ట్ ప్రోమో ఆసక్తి పెంచేసింది.