జబర్థస్త్ స్టార్ కమెడియన్ చలాకి చంటీ హాస్పిటలైజ్ అయ్యారని తెలిసి.. అభిమానులు కంగారు పడుతున్నారు. ఆయనకు ఏమైంది.. అసలే సంగతి ఏంటీ అంటూ ఆరాలు తీస్తున్నారు. ప్రస్తుతం చంటీకి ఎలా ఉంది..? అసలు ఏమైంది...?
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ప్రస్థానం స్టార్ట్ చేసి.. జబర్దస్త్ తో బుల్లితెర స్టార్ గా మారాడు చలాకీ చంటి. టీమ్ లీడర్ గా అద్భుతమైన స్కిట్ లతో సందడి చేసింది ఈస్టార్ కమెడియన్.. గతేడాది బిగ్ బాస్ లో సందడి చేశాడు. ఆతరువాత పెద్దగా కనిపించలేదు. బిగ్ బాస్ తరువాత ఒకటి రెండు షోల్లో కనిపించిన చంటీ.. రీసెంట్ గా సైలెంట్ అయ్యాడు. అయితే ఆయన ఆరోగ్యం బాగాలేదు అన్న వార్త మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
సడన్ గా చంటీ హెల్త్ పాడైపోయిందని.. చంటీకి హార్ట్ ఎటాక్ వచ్చినట్టు టాక్ నడుస్తుంది. ప్రస్తుతం అతడు సీరియస్ కండీషన్ లో ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హాస్పిటల్ లో జాయిన్ అయిన తరువాత చంటీ కండీషన్ మెరుగైనట్టు సమాచారం. చంటీకి సబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ వార్తలు చూసి కంగారు పడుతున్నారు. చలాకీ చంటి చాలారోజుల నుంచి ఎక్కడా షోల్లో గానీ బయట కనిపించలేదు. బహుశా ఏమైనా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడేమోనని అందరూ అనుకున్నారు. కానీ సడన్ గా గుండె సంబంధిత సమస్యల వల్ల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరినట్లు వార్తలొచ్చాయి.
అయితే ఈ వార్తలను ఫస్ట్ ఎవరూ నమ్మలేదు. ఆతరువాత ఇది నిజమేనని తెలిసి.. చంటీ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. తాజాగా చంటీ హెల్త్ అప్ డేట్ వచ్చింది. ఆయన బాగానే ఉన్నారని తెలసుకుని కామెడీ అభిమానులు సంతోషిస్తున్నారు. హాస్పిటల్ లో చేరినప్పుడు చంటి కండీషన్ సీరియస్ గా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సోమవారం లేదా మంగళవారం చంటీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారని సమాచారం. ఇక చంటీ అభిమానులు మాత్రం గెట్ వెల్ సూన్ చంటన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
