ఒకప్పుడు హైపర్‌ ఆదికి ఝలక్‌ ఇచ్చింది జబర్దస్త్ యాంకర్‌ సౌమ్య రావు. కానీ ఇప్పుడు ఆమెకి పెద్ద హ్యాండిచ్చాడు ఆది. వర్షతో కలిసి చెట్టాపట్టాలేసుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.

ఒకప్పుడు హైపర్‌ ఆది.. జబర్దస్త్ కొత్త యాంకర్‌ సౌమ్య రావుతో పులిహోర కలిపాడు. దానికి దిమ్మతిరిగే కౌంటర్లిచ్చింది సౌమ్య రావు. దీంతో నెమ్మదిగా సైలెంట్‌ అయ్యాడు ఆది, ఆ తర్వాత షోనే వదిలి వెళ్లాడు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్ అయ్యింది. ఆమెనే హైపర్‌ ఆది వెంటపడటం షాకిస్తుంది. ఇదే పెద్ద షాక్‌ అంటే, ఆమెకి వర్ష మరో పెద్ద షాకిచ్చింది. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే,

తాజాగా జబర్దస్త్ యాంకర్‌ సౌమ్య రావు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్‌ని పంచుకుంది. ఇందులో హైపర్‌ ఆదితో పులిహోర కలుపుతూ కనిపించింది సౌమ్య రావు. ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా నడుచుకుంటూ వెళ్తారు. మధ్యలో జబర్దస్త్ వర్ష కనిపిస్తుంది.ఆమెని వెనకాల నుంచి గిల్లుతుంది సౌమ్య రావు. అక్కడే పెద్ద దెబ్బ పడింది. 

View post on Instagram

ఆదితో తాను సైలెంట్‌గా వెళ్లకుండా మధ్యలో వర్షని గిల్లింది సౌమ్యరావు. దీంతో వర్ష ఎగ్జైటింగ్‌గా రియాక్ట్ అయ్యింది. అంతేకాదు సౌమ్యరావుకి పెద్ద షాకిచ్చింది. హైపర్‌ ఆదిని తన బుట్టలో వేసుకుంది. వర్ష కి టెంప్ట్ అయని ఆది, ఆమెతో కలిసి వెళ్లిపోగా, ఆ నిర్వాహకం చూసి నోరెళ్లబెట్టడం సౌమ్య రావు వంతు అయ్యింది. ఇది ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు నవ్వులు పూయిస్తుంది. వీరు సరదాగా చేసిన ఈ రీల్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

హైపర్‌ ఆది జబర్దస్త్ ని వీడిన తర్వాత ఆ షో కలే పోయింది. పైగా కొత్త యాంకర్‌గా వచ్చిన సౌమ్య రావు సైతం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతుంది. ఆమె పంచ్‌లకు స్ట్రాంగ్‌గా పంచ్‌లివ్వడంతో ఆమె జోలికెళ్లడమే తగ్గించాడు కమెడియన్లు, దీంతో ఆమె నుంచి ఫన్‌ క్రియేట్‌ కావడం లేదు. పైగా ఆమె మాటల్లో, చేతల్లో అంతటి చలాకీతనం కనిపించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రష్మి, అనసూయలా ఆమె రియాక్ట్ కావడం లేదనే టాక్‌ కూడా వినిపిస్తుంది. దీంతో షో డల్‌ అయ్యింది. 

అయితే సౌమ్య కారణంగానే హైపర్‌ ఆది ఈ షోని వీడారనే కామెంట్లు కూడా వచ్చాయి. కానీ దాన్ని బ్రేక్‌ చేసేందుకు ఈ ఇద్దరు ఇలా చేశారేమో అను సందేహాలు కూడా కలుగుతున్నాయి. మొత్తంగా వర్ష, హైపర్‌ ఆది, సౌమ్య రావు కలిసి చేసిన ఈ రీల్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వర్ష.. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ఇమ్మాన్యుయెల్‌తో కలిసి కామెడీ స్కిట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తమదైన కామెడీతో మెప్పిస్తున్నారు.