2018లో బాలీవుడ్ లో విడుదలైన అంధాదున్ సంచల విజయాన్ని నమోదు చేసుకుంది. విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రసంశలు దక్కించుకుంది. గుడ్డివాడైన యువకుడు పాత్రలో ఆయుష్మాన్ ఖురానా అద్భుతంగా నటించగా, ఆ పాత్ర ఆయనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. ఈ మూవీపై హీరో నితిన్ చాలా కాలం క్రితమే మనసుపారేసుకున్నారు. దీనితో అంధాదున్ తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకోవడం జరిగింది. 

కాగా అంధాదున్ మూవీలో మరో కీలకమైన పాత్ర ఉంటుంది. కథలో కీలమైన ఆ నెగెటివ్ రోల్ టబు పోషించారు. అలాగే ఆ పాత్రకు కొన్ని బెడ్ రూమ్ సన్నివేశాలు కూడా ఉంటాయి. ఓ సన్నివేశంలో హీరోతో టబు బెడ్ పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ పాత్ర కోసం కొందరు పేర్లు పరిశీలించారు. రమ్య కృష్ణ, అనసూయ, టబు వంటి పేర్లు వినిపించాయి. ఐతే ఆ పాత్ర హీరోయిన్ తమన్నా దక్కించుకున్నట్లు నేటి అధికారిక ప్రకటనతో స్పష్టం అయ్యింది. 

చిత్ర యూనిట్ అంధాదున్ తెలుగు రీమేక్ లో తమన్నా, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. టబు పాత్ర తమన్నా చేస్తుండగా, రాధికా ఆప్టే రోల్ నభా నటేష్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నితిన్ స్వయంగా నిర్మిస్తున్నారు. నవంబర్ నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.