ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీపై అధికారిక ప్రకటన జరిగింది. ఎన్టీఆర్ 30వ బర్త్ డే పురస్కరించుకొని బిగ్ న్యూస్ పంచుకున్నారు దర్శక నిర్మాతలు. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ చేస్తున్నాడని ఏడాది కాలంగా ప్రచారం సాగుతుంది. అయితే అనూహ్యంగా ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ ప్రకటించడంతో పాటు షూటింగ్ కూడా మొదలుపెట్టారు. 


ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ చేయడం సందేహమే అని భావిస్తున్న తరుణంలో అధికారిక ప్రకటనతో అందరి సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. సలార్ మూవీ 2022 సమ్మర్ లో విడుదల కానుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ప్రాజెక్ట్ పలు భాషల్లో విడుదల కానుంది. 


ఇక ఎన్టీఆర్ కోసం మంచి యూనివర్సల్ స్టోరీ దర్శకుడు ప్రశాంత్ నీల్ సిద్ధం చేశారట. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వెలువడిన అప్డేట్స్ లో ఇది అతిపెద్దదిగా చెప్పవచ్చు. కాగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ సైతం ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ విడుదల చేసి ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. అలాగే కొరటాల మూవీ టీమ్ విడుదల చేసిన బర్త్ డే పోస్టర్ ఆకట్టుకుంది.