బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరో మారు చరణ్ కి జంటగా నటించనున్నారు. శంకర్ ఆఫీస్ లో ఆయనతో ముచ్చటస్తున్న కియారా ఫోటోను పంచుకున్న టీమ్... ఆర్సీ 15కి వెల్కమ్ పలికారు. అలాగే ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేశారు.
ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందని పెద్ద చర్చ నడిసింది. టాలీవుడ్ కి చెందిన అనేక మంది టాప్ డైరెక్టర్స్ పేర్లు కూడా వినిపించాయి. అయితే చరణ్ అనూహ్యంగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో మూవీ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. చరణ్ 15వ చిత్రం శంకర్ అని తెలిసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.
శంకర్ లాంటి దర్శకుడితో మూవీ చేయాలని ప్రతి హీరోకి ఓ కల ఉంటుంది. ఇక మూవీ ప్రకటన నాటి నుండి జోనర్ పై అనేక ఊహాగానాలు నడిచాయి. ముఖ్యంగా ఇది ఓ పొలిటికల్ థ్రిల్లర్ అని, చరణ్ సీఎం గా కనిపిస్తారని కథనాలు వెలువడ్డాయి. అయితే దీనిపై ఎటువంటి సమాధానం లేదు.
కాగా నేడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో చరణ్ తో జతకట్టనున్న హీరోయిన్ ని రివీల్ చేశారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరో మారు చరణ్ కి జంటగా నటించనున్నారు. శంకర్ ఆఫీస్ లో ఆయనతో ముచ్చటస్తున్న కియారా ఫోటోను పంచుకున్న టీమ్... ఆర్సీ 15కి వెల్కమ్ పలికారు. అలాగే ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేశారు.
చరణ్, శంకర్ ప్రాజెక్ట్ లో కియారా నటిస్తున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. నేటి అధికారిక ప్రకటనతో ఈ విషయం పై క్లారిటీ వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరికి దశకు చేరుకోగా, శంకర్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
