మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో గ్రాండ్ గా కొనసాగుతోంది. ‘గాడ్ ఫాదర్’ దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు. చిరువల్లే 20 ఏండ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నట్టు తెలిపారు.
మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మోస్ట్ అవెయిటెడ్ చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఈరోజు గ్రాండ్ గా కొనసాగుతోంది. మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన మోస్ట్ అవెయిటెడ్ చిత్రం ‘ఆచార్య’ Acharya. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్రీ ఎంటర్ టైనర్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా అభిమానుల్లో జోష్ పెంచుతోంది. ఇప్పటికే గ్రౌండ్ పూర్తిగా ఆడియెన్స్ తో నిండిపోయింది.
ఈవెంట్ వేదికపై అతిథులు సినిమాకు సంబంధించిన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా తమిళ దర్శకుడు మెహన్ రాజా (Mohan Raja) మాట్లాడుతూ కాస్తా ఎమోషనల్ అయ్యారు. 20 ఏండ్ల తర్వాత టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చానని, అది మెగాస్టార్ వల్లే జరిగిందని తెలిపారు. తెలుగులో మొదట జగపతి బాబు, అర్జున్ నటించిన ‘హనుమాన్ జంక్షన్’ సినిమాతో డెబ్యూ దర్శకుడిగా పరిచయం అయ్యానని, ఆ తర్వాత మళ్లీ బాస్ ‘గాడ్ ఫాదర్’ (God Father) చిత్రంతో తిరిగి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యానని తెలిపారు. మెగాస్టార్ బ్లెస్సింగ్స్ వల్లే ఇది సాధ్యమైందన్నారు.
గాడ్ ఫాదర్ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా చివరి దశ షూటింగ్ లో ఉందని తెలిపారు. చిరంజీవితో లాస్ట్ షూట్ అయిపోతుందనే ఆందోళనే తనలో ఎక్కువగా ఉందని తెలిపారు. చిరుతో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిరు, చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. చిరు, చరణ్ కు జోడీలుగా హీరోయిన్లు కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
