మరికొద్ది సమయంలో నేషనల్ కంపనీ లా ట్రిబ్యునల్ లో టీవీ 9 యాజమాన్య కేసు విచారణ జరగనుంది. విచారణ నేపధ్యంలో రవిప్రకాష్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. ఇప్పటికే నటుడు శివాజీ నేషనల్ కంపనీ లా ట్రిబ్యునల్ లో.. టీవీ 9 యాజమాన్యం వివాదంపై కేసు వేశారు.

ఇదే వివాదంపై.. ప్లస్ కంపనీ వెంచర్ కేపిటలిస్ట్ కంపనీ తరఫున కేసు నమోదైంది. ఈ క్రమంలో ప్రస్తుతం రవిప్రకాష్ తో పాటు నటుడు శివాజీ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా...   టీవీ9 యాజమాన్యం వివాదంలో.. తన సంతకం రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి రవి ప్రకాష్ అడ్డుతగులుతున్నారని కౌశిక్‌రావు ఆరోపిస్తున్నారు.

కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ 9ను అలంద మీడియా టేకోవర్ చేసింది. కౌశిక్ రావు ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రవి ప్రకాష్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే టీవీ 9 కార్యాలయంలోని కొన్ని కంప్యూటర్లను కూడా పరిశీలించినట్టు సమాచారం.

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు