రామ్ హీరోగా దర్శకుడు పూరిజగన్నాథ్ రూపొందిస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సెన్సార్ సమస్యలు తప్పవని అంటున్నారు. ఈ సినిమాకి పని చేసిన యూనిట్ సభ్యులు స్వయంగా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో డైలాగ్స్ కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి.

కొన్ని సీన్లు కూడా బాగా బోల్డ్ గా ఉన్నాయి. ఇవేవీ కూడా సినిమాలో కనిపించే ఛాన్స్ లేదని అంటున్నారు. ట్రైలర్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు కాబట్టి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. సినిమా రిలీజ్ కి ముందే ఇచ్చే టీవీ యాడ్స్ లో మాత్రం చాలా మెటీరియల్ కట్ అవుతుంది.

దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో, హీరోయిన్లకు బోల్డ్ డైలాగ్స్ రాస్తుంటాడు. ఈ సినిమాలో కూడా హీరోయిన్ తో పచ్చిగా కొన్ని డైలాగ్స్ చెప్పించాడు. ఎప్పుడూ కంటే ఈసారి పూరి మరింత శృతిమించాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రొమాంటిక్ సీన్లు, తెలంగాణా యాసలో బాగా డెప్త్ కి వెళ్లిపోయాడని అంటున్నారు. 

సినిమాలో అలాంటి సన్నివేశాలకు సెన్సార్ కత్తెర్ పడడం తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పాటల ఎడిటింగ్ వర్క్ జరుగుతోంది. ఈ నెల మూడో వారంలో సెన్సార్ వర్క్ జరగనుంది.